»   » ‘బాహుబలి’ తమిళ కొత్త ట్రైలర్ ఇదిగో (వీడియో)

‘బాహుబలి’ తమిళ కొత్త ట్రైలర్ ఇదిగో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కి రిలీజ్ కు రెడీ గా ఉన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి'. ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. జూలై 10న తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే.

తమిళంలోనూ ఇదే రోజు న ఈ చిత్రం విడుదల అవుతూండటంతో అక్కడా ప్రమోషన్స్ పెంచారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కొత్త ట్రైలర్ విడుదల అయ్యింది. ఆ ట్రైలర్ ని ఇక్కడ మీరూ చూడండి.ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ చిత్రం తమిళ రైట్స్ ‘యూవి క్రియేషన్స్' వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో సంయుక్తంగా ‘బాహుబలి' చిత్రాన్ని వీరు తమిళనాడులో విడుదల చేయనున్నారు. తెలుగులో యూవి క్రియేషన్స్ వారు ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా ‘మిర్చి' చిత్రాన్ని తెరకెక్కించి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థకు మంచి నెట్వర్క్ ఉంది.


చిత్రం లేటెస్ట్ ఇన్ఫో...


ఈ ఉదయం బాహుబలి సౌండ్ మిక్సింగ్‌కు సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఈ సినిమాలో కీరవాణి సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలవనుంది. ఈ రోజుతో కీరవాణి తన పాత్రను పూర్తి చేశారు.


Rajamouli's Baahubali tamil movie trailer

అలాగే ...హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో డీఐ పనులు జరుగుతున్నాయి. త్వరత్వరగా ఈ పనులన్నింటినీ పూర్తి చేసి విడుదల తేదీకి కొన్ని రోజుల ముందే సినిమాను పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు.


ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు.


ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


Rajamouli's Baahubali tamil movie trailer

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Rajamouli's Baahubali movie tamil version trailer released.
Please Wait while comments are loading...