Just In
- 17 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- Sports
వాషింగ్టన్ సుందర్ క్రిస్టియన్ కాదు హిందువే.. అతని పేరు వెనుక ఆసక్తికర కథ!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టీచింగ్ టైం: రాజమౌళి ఐఐటీ పాఠాలు
చెన్నై:దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పాఠాలు చెప్పబోతున్నారు. ఈ నెల 17న ఐఐటీ మద్రాస్ విద్యార్థులకు ఆయన ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఆ రోజు సాయంత్రం రాజమౌళి అక్కడ విద్యార్థులతో ముచ్చటించి వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతారు. ఈ మేరకు ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి.
ఇక కొద్ది రోజుల క్రితం... డైరెక్టర్ ఎస్. ఎస్. రాజమౌళి సృష్టించిన వండర్ బాహుబలి 100 రోజులకు దగ్గర అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఓ సంఘటన అందరినీ మరోసారి ఈ సనిమా గురించి గుర్తు చేసేలా చేసింది. రీసెంట్ గా ...తమిళనాడు వెల్లూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజిలో విద్యార్దులకు బాహుబలి ప్రశ్నలు ఇచ్చారు. వాళ్ళ ప్రస్నాపత్రాన్ని చూసి షాక్ అయ్యారు. బాహుబలి 2 కు చెందిన వార్ సీక్వెన్స్ కు చెందిన ఇంజనీరింగ్ సెట్స్ డిజైన్ చేయమని ఆ పేపరులో ఉంది. వాళ్లు డౌట్ తో తమ ప్రొఫిసర్ ని ఈ విషయమై ప్రశ్నించారు. ఆయన మీరు చూసింది కరక్టే అని ఖరారు చేసి చెప్పారు. రెండు ప్రశ్నలు..తలో పది మార్కులతో ఈ విషయమై ఉన్నాయి.

భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.
చైనాలో 'బాహుబలి'
ఇప్పుడు ఇతర దేశాల్లోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. చైనాలో 'బాహుబలి'ని 5000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు చిత్రాన్ని ఎడిట్ చేశారు. పలు చలన చిత్రోత్సవాలకీ పంపుతున్నారు. చైనాలో ఈ చిత్రం నవంబరు నుంచి సందడి చేయబోతోంది. అక్కడ 'పీకే' చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్స్ ఫిలిమ్స్ సంస్థనే 'బాహుబలి'ని విడుదల చేస్తుండడం విశేషం.

'పీకే'కి చైనాలో మంచి ఆదరణ లభించింది. అదే తరహాలో 'బాహుబలి' కూడా చైనా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.