For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ స్టార్ హీరోతో రాజమౌళి బైలింగ్వుల్

    By Srikanya
    |

    చెన్నై: ప్రముఖ దర్శకుడు రాజమౌళి, తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి సినిమా చేయనున్నారా..అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ మధ్యన తమిళ ఈగ రిలీజైనప్పుడు అక్కడ మీడియాలో ఈ ప్రచారం జరిగింది. ఇప్పుడది నిజమయ్యే అవకాసం కనిపిస్తోంది. ఈ విషయమై రాజమౌళి మాట్లాడుతూ..'నేను, సూర్య కలిశాము అలాగే ఇద్దరం కలిసి సినిమా చేసే చేయాడానికి ఆసక్తి గానే ఉన్నాము. కానీ ఒక సినిమా చేయాలంటే స్పష్టం చేసుకోవలసిన విషయాలు చాలా ఉంటాయి' అని రాజమౌళి తేల్చి చెప్పారు. నిన్న ఆయన 30% షేర్ పెట్టిన అందాల రాక్షసి చిత్రం విడుదలైంది.

    ఇక తమిళ హీరో సూర్యకి తెలుగు మరియు తమిళంలో మార్కెట్ ఉంది. దాంతో వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ప్రభాస్ హీరోగా ఒక సినిమా తీయడానికి స్క్రిప్టు వర్క్ చేసుకుంటున్నారు.సూర్య విషయానికి వస్తే...సూర్య,కాజల్ కాంబినేషన్ లో మాట్రాన్ టైటిల్ తో తమిళంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో 'డూప్లికేట్‌' అనే పేరును ఖరారు చేశారు. కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ ని బెల్లంకొండ సురేష్ చేజిక్కించుకున్నారు.

    కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వేసవవిలో భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కాజల్ హీరోయిన్ కావటం కూడా ఈ చిత్రానికి ప్లస్. సూర్య చిత్రాలు తెలుగులో గతంలో ఇక్కడ మంచి విజయం సాధించటంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజీలలో ఉంది.

    English summary
    SS Rajamouli said that he has met Surya a couple of times regarding the possibility of making a movie together. But there are going to be many issues to be sorted out before going any further. Rajamouli’s first production venture Andala Rakshasi got released today. He has bought 30% of share for this film a couple of weeks back from the producer Sai Korrapati.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X