తాతయిన సూపర్‌స్టార్ రజనీ
సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ తాతగారయ్యారు. ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో అక్టోబర్ 10వ తేదీన (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ సమయంలో ఐశ్వర్య భర్త ధనుష్ ఊటీలో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో శ్రియ ప్రధాన పాత్రధారి. మరోవంక రజనీకాంత్ కూడా చెన్నైలో శివాజీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ శుభవార్త చెవినపడగానే రజనీకాంత్, ఊటీ నుంచి ధనుష్ హుటాహుటిన అపోలో హాస్పిటల్‌కు చేరుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అసంఖ్యాకంగా రజనీకాంత్, ధనుష్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications