పాలను వేస్ట్ చేస్తున్నారంటూ రజనీకాంత్ మండిపాటు
వేల కొలదీ లీటర్ల పాలను వృధా చేస్తున్నారంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ మండిపడుతున్నట్లు సమాచారం. తాజాగా ఆయన చిత్రం రోబో విడుదల సందర్భంగా రోబో కౌటౌట్స్ కి పాలాభిషేకాలు చేస్తున్నారు అభిమానులు. ఈ విషయం మీడియాలో రావటంతో మరింత ఉత్సాహంగా చాలా చోట్ల ఈ విధమైన పాలను తీసుకొచ్చి ఫాన్స్ పండుగ చేస్తున్నారు. ఇది గమనించిన రజనీకాంత్..తాను ఈ పాలాబిషేకాల పట్ల చాలా సంతోషంగా లేనట్లు ప్రకటించారు. ఆయన తన అభిమానులను అటువంటి పనులు చేయవద్దని, ఆపుచేయమని ప్రెస్ నోట్ విడుదల చేసినట్లుగా తమిళ మీడియా తెలుపుతోంది. ఇక రోబో చిత్రం ఊహించిన దానికంటే చాలా భారీ స్ధాయిలో విజయం నమోదు చేసుకుంది. ఎక్కడ విన్నా ఈ చిత్రం గురించే చర్చలు,ఈ చిత్రం కలెక్షన్స్ గురించి కబుర్లు, గ్రాఫిక్స్ గురించే ఆలోచనలు సాగుతున్నాయి. రజనీ అభిమానులే కాక అందరినీ ఈ చిత్రం పూర్తి స్ధాయిలో ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











