twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ 'శివాజి 3D' కి రెస్పాన్స్ ఏంటి

    By Srikanya
    |

    చెన్నై : 'సింహం సింగిల్ వస్తుంది..పందులే గుంపులుగా వస్తాయి ' అంటూ రజనీకాంత్‌ అలరించిన చిత్రం 'శివాజి'. ఈ సినిమా 3డీ సాంకేతిక సొబగులను అద్దుకుని బుధవారం తమిళనాట విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల చెన్నై నగరంలో జరిగిన ప్రత్యేక ప్రదర్శనలో నటుడు రజనీకాంత్‌, వివేక్‌ వంటి ప్రముఖులు చిత్రాన్ని వీక్షించారు. తనకే కొత్త అనుభూతి మిగిలిందని రజనీ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల బ్రహ్మరథం పడటంపై ఏవీఎం నిర్మాణరంగం కృతజ్ఞతలు తెలియజేసింది.

    ఈ విషయం నిర్మాతలు ఎం.శరవణన్‌, ఎం.ఎస్‌.గుహన్‌ విడుదల చేసిన ప్రకటనలో.. శివాజి 3డీ ప్రయోగానికి సహకరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఆశించిన స్థాయిలో విజయం సాధించింది. 3డీ సినిమా రెండు గంటలకన్నా ఎక్కువగా ఉండకూడదనే నిబంధనతో కొన్ని సన్నివేశాలను తొలగించాం. అయినప్పటికీ సినిమా 2గంటలకన్నా ఎక్కువగానే ఉంది. తొలగించిన సన్నివేశాల గురించి ఎవరూ బాధపడకూడదు. చిత్రం చూసిన ప్రతిఒక్కరూ మంచి అనుభూతి మిగిలిందని చెబుతున్నారని పేర్కొన్నారు

    ఇక ఈ చిత్రం వీకెండ్స్ మొత్తం థియోటర్స్ లో బుక్ అయిపోయాయని డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. నిర్మాత ఎస్‌ఎస్ గుహన్ మాట్లాడుతూ- 'శివాజీ' చిత్రాన్ని 2డి నుండి భారీ ఖర్చుతో త్రీడీ ఫార్మేట్‌లోకి మార్చామని, ఈ సినిమా హిట్ రేంజిపై 'రోబో' 'నరసింహ' వంటి చిత్రాలను కూడా త్రీడీ లోకి మార్చే ఆలోచన ఉందనీ, రజనీకాంత్ చిత్రాలను ఇదే విధంగా చేయాలన్న కోరిక ఉందని తెలిపారు. రజనీకాంత్ హావభావాలు, ఐశ్వర్యారాయ్ అందచందాలు వెండితెరపై త్రీడీలో చూసే అదృష్టం ప్రేక్షకులకు లభించిందనీ అన్నారు.

    రజనీకాంత్ మాట్లాడుతూ... సినిమా అత్యద్భుతంగా వచ్చింది. 3డీ హంగులు అద్దేందుకు వెచ్చించిన ఖర్చుతో రెండు కొత్త చిత్రాలు తీయొచ్చు. ఏవీఎం సంస్థ ప్రతిష్ట మరింత పెంచేదిగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అభిమానులకు నేనిచ్చిన జన్మదిన కానుక. 3డీ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

    English summary
    Watching Rajanikanth recreate the magic in 3D, closer to hands-reach, is a once-in-a-lifetime experience. Released five years after its original release in 2007, Sivaji 3D, with shorter running time, cut down by half an hour, is highly entertaining and three times visually enthralling.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X