»   » మహేష్ కు రజనీ ఊహించని ట్విస్ట్...ఇప్పేడేం నిర్ణయం తీసుకుంటాడో?

మహేష్ కు రజనీ ఊహించని ట్విస్ట్...ఇప్పేడేం నిర్ణయం తీసుకుంటాడో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: గతంలో లాగ కాకుండా రిలీజ్ డేట్ విషయంలో చాల పక్కా ప్లానింగ్ తో వస్తున్నారు భారీ చిత్రాల దర్శక,నిర్మాతలు. ధియోటర్స్ సమస్య ఎదురు కాకుండా రెండు నెలలు ముందుగానే తమ చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. రామ్ చరణ్ వంటివాళ్లతై చిత్రం ప్రారంభం రోజే రిలీజ్ డేట్ విషయమై క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

ఇలా తాము ముందుగా ప్రకటించటం వల్ల అప్పుడు మిగతా చిత్రాల వాళ్ల రిలీజ్ డేట్ ఫ్లానింగ్ కు ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. కానీ దాదాపు అదే సమయంలో రిలీజ్ అనుకున్న మరికొన్ని పెద్ద సినిమాలు వాళ్లకు అరెరే మనమే ముందుగా ప్రకటించి ఉంటే బాగుండేది అనిపించేలా మారుతోంది.
ఇప్పుడు రజనీ కబాలి చిత్రం రిలీజ్ డేట్ లాక్ చేసి రిలీజ్ చేసారు. మే 27 సినిమాని రిలీజ్ చేస్తామని అన్నారు. అయితే ఈ రిలీజ్ డేట్ మహేష్ ..బ్రహ్మోత్సవాని దెబ్బ కొట్టినట్లు అయ్యిందని సమచారం.

Rajani twist to Mahesh: Kabali to release on May 27

'బ్రహ్మోత్సవం' కూడా మే నెలలోనే విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మే 31 అని అధికారికంగా ప్రకటించకపోయినా అదే రిలీజ్ డేట్ గా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మోత్సవం టీమ్ తమ డేట్ ని మార్చుకోవాల్సిన పరిస్దితి.

ఎందుకంటే కబాలి తెలుగులోనూ భారీగా విడుదల అవుతోంది. అలాగే బ్రహ్మోత్సవతం తమిళంలోనూ భారీగానే విడుదల చేస్తున్నారు. ఇలా ఇద్దరు సూపర్ స్టార్స్ తమ సొంత రాష్ట్రంలో కాక ప్రక్క రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయాలన్న ప్లాన్ ఉన్న నేపధ్యంలో రిలీజ్ డేట్స్ క్లారిటీ గా ఉండకపోతే దెబ్బయిపోతారనేది నిజం.

English summary
Rajanikanth starrer Kabali will come to theatres on the 27th of May.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu