తమిళ స్టైల్‌లో గెస్ట్‌గా రజనీకాంత్
లారెన్స్- ప్రభుదేవాల స్టైల్ సినిమా తమిళంలోకి అనువాదం కాబోతోంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌కు కూడా లార్స్‌కో శ్రీధర్ నిర్మాత. తెలుగులో భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ఫర్వాలేదనిపించినా కలెక్షన్లు నిర్మాణ వ్యయానికి తగినట్టు లేవు. అందువల్ల ఈ సినిమా దర్శకుడు నిర్మాత శ్రీధర్‌కు లోటును పూడ్చేందుకు తమిళ వెర్షన్‌కు ప్రారంభిస్తున్నారు. తెలుగు స్టైల్‌లో చిరంజీవి, నాగార్జున అతిధి నటులుగా కన్పించి కలెక్షన్లను కొంచెం పెంచిన విషయం తెలిసిందే. స్టైల్ తమిళ వెర్షన్‌లో రజనీకాంత్, విజయ్ కన్పించనున్నారు. వీరిద్దరి సీన్లను ప్రత్యేకంగా షూట్ చేయనున్నారు. మిగితా సినిమా ఆంతా డబ్బింగే. ఇది లారెన్స్ చేస్తున్న తెలివైన ప్రయోగం . ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ.


Click it and Unblock the Notifications