రెమ్యునేషన్ లో టాప్ ఆ హీరోనే
ఇండియాలో రెమ్యునేషన్ లో ఎక్కువ తీసుకునేది అమీర్ ఖాన్,సల్మాన్ ఖాన్,షారూఖ్ అనుకుంటారు. కానీ అదేమీ కాదు రజనీకాంత్ అంటూ ఓ లీడింగ్ హిందీ పత్రిక న్యూస్ ఐటం చేసింది. వారు చెప్పే దాని ప్రకారం ప్రస్తుతం అధిక పారితోషికం తీసుకునే వారిలో రజనీకాంత్ మొదటి స్ధానంలో ఉన్నారు. ఆసియాలో జాకీఛాన్ ఉన్నారు. జాకీ ఛాన్ తర్వాత ప్లేస్ రజనీకాంత్ దే అని చెప్తున్నారు. ఇక తమిళంకు వస్తే రజనీ తర్వాత ప్లేసులో కమల్‌హాసన్‌నే ఉన్నారు. వీరిద్దరి తరువాత తమిళంలో అజిత్, విజయ్ పేరు చోటు చేసుకున్నాయి. విజయ్ యాక్షన్,కామిడీ అంటూ కమర్షియల్ బాణీలో రజనీకాంత్‌ను ఫాలో అవుతున్నారు. అజిత్ చిత్రాలకు వచ్చే కలెక్షన్లు ఒక మ్యూజిక్ మాదిరిగానే ఉన్నాయి. విజయ్, అజిత్ తమ ఫేస్ వ్యాల్యూస్ మాత్రమే నమ్ముకుని తమదైన వందల చిత్రాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక వీరిద్దరిలోనే కొంచెం భిన్నంగా విక్రమ్, సూర్య వైవిధ్య భరిత పాత్రలతో సక్సెస్ బాట పయనిస్తున్నారు. సూర్య నటించిన చిత్రాలు తమిళంతో పాటు ఆంధ్రాలోను అనువాదమై సక్సెస్ కావడంతో ఆయన మార్కెట్ హైరేంజ్‌లోనే ఉంది. ఆయన తమ్ముడు కార్తీ నాలుగు చిత్రాల్లో నటించినా తమిళం, తెలుగులోనూ సక్సెస్‌ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ తరం హీరోలు శింబు, ధనుష్ పారితోషికాలు కోట్లలోనే ఉన్నాయి. వీరి తరువాత విశాల్, జయం రవి, ఆర్య, జీవా తదితరులు అధిక పారితోషికం తీసుకుంటున్న జాబితాలో ఉన్నారు. ఇక తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు రెమ్యునేషన్ అందరికన్నా టాప్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











