ఇటు 'రోబో' విజయ యాత్ర..అటు 'రజనీ' హిమాలయ యాత్ర
ఓ ప్రక్క రోబో చిత్రం విజయయాత్రలు ప్లాన్ చేస్తూంటే..రజనీ మాత్రం హిమాలయాలకు ప్రయాణం అయ్యారు. చెన్నై నుంచి ఢిల్లీ చేరుకునిఅక్కడినుంచి హిమాలయాలకు వెళతారు. అక్కడ నెల రోజుల పాటు ధ్యానం లో గడుపుతారని తెలుస్తోంది. అ తర్వాత చెన్నై తిరిగి వస్తారు. ఆ తరువాత తాను నటించనున్న నూతన చిత్రం గురించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. ఇక రోబో చిత్రం దాదాపు 140 కోట్ల రూపాయలతో తీశారు. చిత్రం తొలి వారం 117 కోట్లు కలెక్ట్ చేసింది. తమిళనాడులో 60, ఆంధ్ర ప్రదేశ్‌లో 30, కర్నాటకలో 8, కేరళలో 4, హిందీ వెర్షన్ 15 కోట్లు తొలి వారానికి వసూలు చేసి రికార్డ్ సృష్టించిందని నిర్మాతలు చెప్తున్నారు. అలాగే సల్మాన్‌ఖాన్ రీసెంట్ హిట్ దబాంగ్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఎక్కువ వసూళ్లు కురిపించిన చిత్రంగా నమోదైంది. దబాంగ్ రెండు వారాలకు సాధించిన వసూళ్లను రోబో మొదటి వారానికే సాధించిందని ముంబయ్‌కి చెందిన ట్రేడ్ విశ్లేషకుడు సునిల్ వాదా అంటున్నారు. విడుదలైన థియేటర్లలో 92 శాతం హౌస్‌ఫుల్‌తో సాగుతూ రోబో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.


Click it and Unblock the Notifications











