twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కబాలి' :రజనీ గెటప్ పై ఇంకో హాట్ న్యూస్

    By Srikanya
    |

    చెన్నై : రజనీకాంత్‌ తర్వాతి చిత్రానికి 'అట్టకత్తి' దర్శకుడు రంజిత్‌ దర్శకత్వం వహించడం ఖరారు కావడంతో తర్వాతి పనుల్లో చిత్రయూనిట్‌ నిమగ్నమైన సంగతి తెలిసిందే. పలు టైటిళ్ల పరిశీలన తర్వాత 'కబాలి' అనే పేరు పెట్టారు. ప్రస్తుతం 'కబాలి' ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రజనీ అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. చిత్రంలో కథేమిటి...రజనీ పాత్ర ఎలా ఉండబోతోందనేది, ముఖ్యంగా రజనీ గెటప్ ఎలా ఉంటుంది హాట్ టాపిగా నడుస్తోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం రజనీ తన సొంత గెడ్డంతో ఈ చిత్రంలో కనిపించనున్నారు.

    ఈ చిత్రం తొలి విడత చిత్రీకరణను మలేషియాలో చేపట్టాలని నిర్ణయించి అక్కడ లొకేషన్లు కూడా ఎంపిక చేశారు. రెండో విడత చిత్రీకరణను చెన్నైలో చేపట్టడానికి నిర్ణయించారు. ప్రస్తుతం తొలి విడత చిత్రీకరణ చెన్నైలో చేపట్టాలని, వినాయక చవితి సందర్భంగా చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలివుడ్‌ సమాచారం. దానికి ముందుగా సెప్టెంబరు 17న చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు.

    సినిమాలో రజనీకాంత్‌ చెన్నైకు చెందిన ఓ డాన్‌గా కనిపిస్తారట. రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కలైరాసన్‌, ప్రకాష్‌రాజ్‌, ధన్సిక ఇతర ముఖ్య పాత్రధారులు. కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణ్‌ సంగీతమందిస్తున్నారు.

    Rajini appears in own beard after long gap

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా హై ఫ్రొఫైల్ ఫొటో షూట్ జరిగింది. కొరియన్ ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో షూట్ చేసారు. రజనీ లుక్..సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్ తో కూడిన విగ్, దాదాపు 1991లో ఆయన చేసిన ధర్మ దురైలో గెటప్ లాగ ఉంటుంది. బాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు ఈ ఫొటో షూట్ కోసం ప్రత్యేకమైన మేకప్ చేసారు. ఫొటో షూట్ లో రాధికా ఆప్టే ఎనభైల నాటి అవుట్ ఫిట్ తో ఉన్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సెప్టెంబర్ రెండవ వారంలో బయిటకు వస్తుంది.

    చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు.

    దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది. కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు. వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

    Rajini appears in own beard after long gap

    తమ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఎప్పుడెప్పుడు కొత్త సినిమాతో వస్తారా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూంటారు. ఆ ఎదురుచూపులు ఈ మధ్య మరీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే...ఆయన రీసెంట్ చిత్రం 'లింగ' అంచనాలు తలక్రిందులు చేసి ఫ్లాప్ కావటంతో తదుపరి చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఎవరూ వూహించనివిధంగా ఆయన కొత్త దర్శకుడు రంజిత్‌కు అవకాశమిచ్చారు. ఓకే డైరక్టర్ ఖరారు అయ్యారు. దాంతో ఈ చిత్రం టైటిల్ ఏమిటి..కథ ఏమిటి అనే విషయాలు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

    ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం. ఆమె రజనీకుమార్తె. దన్సిక మాట్లాడుతూ... దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు.

    అలాగే దర్శకుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు. తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం.

    చిత్రానికి సంబంధించిన 'ఫ్యాన్స్‌మేడ్‌' ఫొటోలు, పోస్టర్లు మరింత ఆసక్తికరంగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలురకాల పోస్టర్లు కనిపించగా.. తాజాగా రజనీకాంత్‌ ఒరిజినల్‌ రూపురేఖలతో ఉన్న చిత్ర పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

    హీరోయిన్ రాధికా ఆప్టే తో ఫార్మల్ ఫోటో షూట్ నిర్వహించినట్లు సమాచారం. ఇందులో రజనీకాంత్‌ అసలైన రూపంలో అంటే మేకప్ లేకుండానటిస్తున్నారని ఆదివారం నుంచి ప్రచారమవడంతో దీనికి సంబంధించిన ఫ్యాన్స్‌మేడ్‌ ఫొటోలు కూడా దర్శనం ఇస్తున్నాయి. సినిమాలో ఒరిజనల్ లుక్ తో మేకప్ లేకుండా కనపడినా ...ఫ్లాష్ బ్యాక్ సీన్లలో మాత్రం మేకప్ వేసి లుక్ మారుస్తారని చెప్తున్నారు.

    Rajini appears in own beard after long gap

    ఇక దర్శకుడు రంజిత్ ..విషయానికి వస్తే...అతనో యంగ్ డైరెక్టర్.. ఇప్పటివరకూ కేవలం రెండు చిత్రాలకే దర్శకత్వం వహించాడు.. అయితేనేం.. తన కథతో బడా ప్రొడ్యూసర్ ను ఒప్పించాడు... కోలీవుడ్ సూపర్ స్టార్ ను మెప్పించాడు. దీంతో రజనీకాంత్ నెక్స్ట్ మూవీకి దర్శకుడయ్యాడు రంజిత్.

    రజనీకాంత్ తదుపరి చిత్రం విషయమై.. కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్.

    తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు.

    తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది. మరి.. లింగా వంటి ఘోర పరాజయం తర్వాత.. రజనీకాంత్ నటిస్తున్న ఈ సినిమా.. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ ఏ మేరకు మెప్పిస్తుందేమో చూడాలి.

    English summary
    Rajini is appearing with his original beard in Kabali after a long gap. Except for the title Kabali that is trending on social networking platforms, everything about superstar Rajinikanth’s next movie has been kept under wraps.It is reportedly Rajini sported a look with salt-n-pepper short wig with an ivory stubble similar to something he donned in his 1991 blockbuster Dharma Durai. And Bhanu Bashyam, the Bollywood makeup artist who has been his lucky mascot for over a decade, flew to Chennai for this purpose.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X