twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ రజనీకాంత్ !!

    By Staff
    |

    Rajinikanth
    రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న 'యంతిరిన్' (రొబో) చిత్రం విడుదలకు బాగా ఆలస్యమయ్యేటట్లు ఉంది. అయితే అంతకాలం రజనీ అభిమానులకు ఉత్సాహం లేనట్టేనా...అంటే దానికి సమాధానంగా అప్పట్లో అంటే 1996లో వచ్చి సూపర్ హిట్టయిన రజనీకాంత్ బాషా చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు.

    రజనీకాంత్ కెరీర్ లోనే అత్యుత్తమ నటన ప్రదర్శించిన చిత్రాల్లో బాషా ని ఒకటిగా చెప్తూంటారు. రజనీకాంత్, నగ్మా, రఘువరన్, జనక్ రాజ్ ప్రధాన పాత్రల్లో సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.ఎం.వీరప్పన్ నిర్మించారు. ఇందులో రఘువరన్, రజనీకాంత్ పోటీపోటిగా ప్రదర్శించిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు వెంటాడుతూనే ఉంది. అంతెందుకు ఆ తర్వతా భాషా ప్రేరణతో తెలుగు,తమిళ బాషల్లో కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చాయి. ప్లాష్ బ్యాక్ నేరేషన్ చిత్రాలన్ని భాషా స్క్రీన్ ప్లే చిత్రాలనటం పరిపాటి అయింది.

    ఇక అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేయడం ఖాయమని ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న ఓకె ఫిలిమ్స్ ప్రతినిధులు చెబుతున్నారు. వారు ఈనెల 27న సినిమా రీ-రిలీజ్ కు సన్నాహాలు చేస్తుండటంతో రజనీ అభిమానులు సైతం సంబరాలకు సిద్ధపడుతున్నారు. రజనీ ఎప్పుడు వచ్చినా, ఏ రూపంలో వచ్చినా తమ చేసే సంబరాలుకు లోటుండదని అభిమానులు అంటున్నారు. 'యంతిరిన్'కు ముందుగా 'బాషా' వస్తుండటం వారి ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేస్తోంది.

    'యంతిరిన్' చిత్రాన్ని ఇండియన్ సినీ చలన చరిత్రలోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆయనకు జోడిగా తొలిసారి ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. ఇక బాషా చిత్రం విడుదల గురించి చెన్నై సినీ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రజనీ రెగ్యులర్ సినిమాలా దీనికి ఓపినింగ్స్ వస్తాయా...ఎన్నో సార్లు టీవీల్లో చూసిన జనం ఎగబడి చూస్తారా అని..ఏదైమైనా ఈ మధ్య కాలంలో సెకెండ్ రిలీజ్ అనేది ఏ చిత్రానికీ లేదు. అది భాషా చిత్రం దక్కించుకోనుంది. దటీజ్ రజనీ అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X