రజనీ పుస్తకం జపనీస్ భాషలో కూడా..

By Bojja Kumar

సూపర్ స్టార్ రజనీ కాంత్ కు సంబంధించిన 'రజనీస్ పంచతంత్ర-వాల్యూ స్టేట్ మెంట్స్ ఫర్ మేనేజింగ్ లైప్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్' పుస్తకాన్ని త్వరలో జపానీస్ భాషలోకి అనువదించి జపాన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత సంవత్సరం తమిళం, ఇంగ్లీష్ లో విడుదలైన ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభించింది. రజనీకి జపాన్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో.....అక్కడ కూడా ఈ పుస్తకానికి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే...రజనీకాంత్ 'రాణా'సినిమాను అటకెక్కించి కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కోచాదయన్' సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన అనుష్కను ఎంపిక చేయనుందని, రజనీ చెల్లెలి పాత్రలో స్నేహ నటిస్తుందని తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X