రజనీ ‘కొచ్చాడయాన్’కి పాజిటివ్ రివ్యూ!
ఈ సినిమా గురించి తమిళ డైరెక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ...ఫిల్మ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ముందుగా ఊహించినట్లే సినిమా ఎంతో గొప్పగా వచ్చినట్లు వెల్లడించారు. రజనీకాంత్ తో పాటు దర్శకురాలు సౌందర్యరజనీకాంత్, సినిమా యూనిట్ సభ్యులు సినిమా ఫస్ట్ కాపీపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారు.
కొచ్చాడయాన్ సినిమా ఆసియాలోనే తొలి మోషన్ క్యాప్చర్ సినిమా. గతంలో ఈ టెక్నాలజీ హాలీవుడ్ సినిమాలు అవతార్, టిన్ టిన్ చిత్రాల్లో మాత్రమే ఉపయోగించారు. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు లండన్ లోని పీనివుడ్స్ స్టూడియోలో జరుగుతున్నాయి. మరో 25 రోజుల్లో ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రం ద్వారా రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. శరత్ కుమార్, ఆది పనిశెట్టి, దీపిక పడుకొనె, శోభన, జాకీ ష్రాఫ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్, మీడియా వన్ గ్లోబర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రఖ్యాత మ్యూజీషియన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. తెలుగులో ఈచిత్రం 'విక్రమ సింహా' పేరుతో విడుదలకానుంది.


Click it and Unblock the Notifications












