పవర్ కట్‌పై సూపర్ స్టార్ ఫ్యామిలీ బరస్ట్
కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు..అన్ని చోట్లా పవన్ కట్ సమస్య ఉన్నట్లుంది. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యా ధనుష్ ఈ విషయంపై మండిపడుతూ ట్వీట్ చేసింది. ఆమె ట్విట్ లో...ఆఫ్ టు వర్క్...సౌండ్ మిక్సింగ్.. పవర్ కట్ ఎట్ హోమ్..హేట్ లాంగ్ పవన్ కట్స్... హాట్ డే అని ట్వీట్ చేసింది. దానికి చాలా మంది నమ్మకుండా రకరకాల ప్రశ్నలతో ఆమెకు తిరిగి రిప్లై ఇచ్చారు. దాని ఆమె తిరిగి స్పందిస్తూ..ఫన్నీగా.. హేహే...పవన్ కట్ అవుతోందంటే ఎందుకు ఆశ్చర్యపోతున్నారు... ట్వీట్స్... జనరేటర్ మీద ఆధారపడటం తప్పేటట్లులేదు. సారీ ఇలా బరస్ట్ అవుతున్నందుకు అంటూ ట్వీట్ చేసింది.
అయితే ఇది విచిత్రంగా ఉండొచ్చు కానీ సూపర్ స్టార్ స్టేటస్ లో ఉన్న ఫ్యామీలలకు కూడ పవర్ కట్ అవ్వటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె తన తాజా చిత్రం త్రీ బిజిలో ఉన్నారు. తన భర్త ధనుష్ హీరోగా శృతి హాసన్ కాంబినేషన్ లో ఆమె రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే ఈ చిత్రంలోని కొలావరి డి పాట పాపులర్ అయ్యి ఈ చిత్రానికి యమా క్రేజ్ తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











