twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ ఫ్యాన్‌ను చంపిన తలైవా అభిమాని.. షాక్‌లో కోలీవుడ్

    |

    అభిమానానికి పరాకాష్ట తమిళ నాట కనిపిస్తూనే ఉంటుంది. తమిళ నాట అభిమానులు తమ హీరోలు ఏ రేంజ్‌లో ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి అభిమానాన్ని చాటుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తారు.. లేదా అవతలి వారి ప్రాణాలను తీస్తారు. తమ హీరో పరువును నిలబెట్టేందుకు మాటల యుద్దం కాస్తా ప్రాణాలను తీసేవరకు వెళ్లింది. ఈ ఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

    కరోనా విరాళాలు..

    కరోనా విరాళాలు..

    కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వాలకు అండగా నిలబడేందుకు స్టార్ హీరోలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు.

    ఫెఫ్సీకి పెద్ద మొత్తంలో..

    ఫెఫ్సీకి పెద్ద మొత్తంలో..

    దక్షిణ భారత నటీనటుల సంఘానికి అధ్యక్షుడుగా ఉన్న ఆర్కే సెల్వమణి పిలుపు మేరకు కొందరు హీరోలు కదిలి వచ్చారు. మొట్టమొదటగా సూపర్ స్టార్ రజినీకాంత్ రూ. 50 లక్షల విరాళాన్నిఅందించాడు. ఆ తరువాత యువ హీరోలంతా కదిలివచ్చారు. నయనతార, అజిత్, దళపతి విజయ్ ఆలస్యంగా స్పందించినా పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించారు.

    మొత్తంగా కోటీ ముప్పై లక్షలు..

    మొత్తంగా కోటీ ముప్పై లక్షలు..


    విజయ్ మొత్తం కోటీ ముప్పై లక్షలను విరాళంగా ప్రకటించాడు. ఇందులో ప్రధాన మంత్రి నిధికి రూ. 25 లక్షలు, తమిళ నాడు ముఖ్యమంత్రి నిధికి 50లక్షలు, దక్షిణ భారత నటీనటుల సంఘాం (ఫెఫ్సీ)కి 25 లక్షలు, కేరళకు 10 లక్షలు, ఏపీకి 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు, పుదుచ్చెరికి 5 లక్షలు, కర్ణాటకకు 5 లక్షలు ప్రకటించాడు. ఇలా దక్షిణ రాష్ట్రాలన్నింటికి విరాళం ఇచ్చిన ఏకైక హీరోగా విజయ్ నెటిజన్ల మనసు దోచుకున్నాడు.

    Recommended Video

    Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
    వాగ్వాదంలో ఒకరి మృతి..

    వాగ్వాదంలో ఒకరి మృతి..

    అయితే ఈ విరాళాల్లో తమ హీరోనే గొప్పా అంటే తమ హీరోనే గొప్పా అని ఇద్దరు అభిమానులు కొట్టుకున్న ఘటనం విల్లూప్పురం జిల్లాలోని మరక్కణంలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో విజయ్ అభిమాని యువరాజ్ (22), రజినీ అభిమాని దినేష్ బాబు చేతిలో దుర్మరణం చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

    English summary
    A Rajinikanth fan kills Vijay fan over an argument on Coronavirus donations. M Yuvaraj, aged 22, died on the spot. It is now said that the deceased suffered head injury.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X