డర్టీ హీరోయిన్ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ గరం గరం...!?
ఫ్యామిలీ హీరోయిన్ నుండి హాట్ క్లబ్ హీరోయిన్ ల మారి 'డర్టీ పిక్చర్"తో సెక్సీ హీరోయిన్ అవతారమెత్తిన హీరోయిన్ విద్యాబాలన్. ఒక పక్క సిల్క్ స్మిత క్యారెక్టర్ కు ఏ మాత్రం సరిపోలేదని.. కళ్లతోనే నిషా ఎక్కించే సిల్క్ చూపులు విద్యాబాలన్ పరువాలన్నీ ఆరేసినా రాలేదని విమర్శకులు పెదవి విరుస్తుంటే ట్రైలర్లు విడుదల కావటమే ఈ చిత్రంపై వివాదాలు కూడా మొదలయ్యాయి. ఫ్యాన్సీ ఆఫర్లు ఇవ్వటానికి బయ్యర్లు రెడీగా ఉన్నారని వార్తలు వస్తున్నా రజనీ అభిమానలు మాత్రం ఈ చిత్రంపై పూర్తి అసంతృప్తితో ఉన్నారని సమాచారం. రజనీకాంత్ కు, ఈ చిత్రంకు సంబంధం ఏముంది అని అంటే..ప్రత్యక్షంగా సంబంధం లేదు కానీ సిల్క్ స్మితతో నటించిన కథానాయకునిగా ఆమెతో కాస్త సంబంధమే ఉంది. అయితే ఆ సంబంధాన్ని వల్గర్ గా చూపారన్నది రజనీ అభిమానుల ఆవేదన. సినిమా విడుదల కాక ముందే ఏమిటీ గోల అని అంటే...
ఇందులో నసీరుద్దీన్ షా, విద్యాబాలన్ సీన్లు కొంత హాట్ హాట్ గా ఉన్నాయట. ట్రైలర్స్ లో నసీరుద్దీన్ పాత్ర కొంత రజనీకాంత్ స్టైల్ ని పోలివుందని అభిమానుల ఆరోపణ అయితే అభిప్రాయాలను నిర్మాత తోసిపుచ్చుతున్నాడు. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా వయసు పైబడిన వ్యక్తిగా నటించారు. రజనీకాంత్ వయస్సులో వుండగా సిల్క్ స్మితతో నటించారు. ఆయనకు, నసీరుద్దీన్ షా క్యారెక్టర్ కి అసలు పోలికే లేదు అంటున్నారు. ఇదంతా ఎవరో గిట్టనివారు చేస్తున్న ప్రచారం అని ఆరోపణలను కొట్టిపారేస్తున్నాడు. కాగా సినిమా విడుదల అయిన తర్వాత కానీ తెలియదు..ఎవరు క్యారెక్టర్ ఏమిటి అనేది...


Click it and Unblock the Notifications











