శంకర్ దర్శకత్వంలో రెడీ అవుతున్న రొబొలో రజనీకాంత్ ద్విపాత్రల్లో కనిపించనున్నారనే వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో షికారు కొడుతోంది. ఆ సినిమాలో ఆయన ఓ సైంటిస్టు గానూ, రొబొ గాను కనిపించనున్నారని చెప్పుకుంటున్నారు. సైంటిస్ట్ పాత్ర రజనీ రెగ్యులర్ సైల్స్ తో ఉంటుందని అంటుందంటున్నారు. అందులోనూ పేపర్లకి ఇచ్చిన పబ్లిసిటీ స్టిల్ లో రజనీ ఓ రొబొలా కనపడటం ఈ వార్తకు సోర్స్ అయి ఉండవచ్చను. అలాగే రొబో పాత్ర కూడా ప్రాణమున్న మనిషిలా అన్ని రాగ ద్వేషాలు పలికిస్తుందని,స్టంట్స్ ,ట్రిక్స్ అన్ని చేసి వినోదం పంచుతుందని చెపుతున్నారు. ఈ చిత్రానికి తమిళంలో యంత్రం అనే పేరును పెట్టారు. తెలుగులో మాత్రం రొబొ అనే పేరు ఉంటుందంటున్నారు.