సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న 'కుచేలుడు' సినిమా రోజుకో విశేషంతో అందరి నోళ్ళలో నానుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పబోతున్నారనే వార్త చెన్నైని చుట్టుముడుతోంది. ఇప్పటి వరకు ఆయన డబ్బింగ్ చిత్రాలకు వేరే వారు గొంతు అరువిచ్చేవారు. కాని కుచేలుడు లో పాత్ర తక్కువ నిడివి ఉండటంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చిత్రంలో ఆయన నిజ జీవితం లోని సూపర్ స్టార్ పాత్రలోనే కనపడనున్నారు. మళయాళ సూపర్ హిట్ 'కథా పెరియంబోల్' ఆథారంగా పి.వాసు ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత అశ్వనీదత్ తెలగులో అందిస్తున్నఈ సినిమాలో జగపతి బాబు బార్బర్ గా కథలో కీలకమైన పాత్రని చేస్తున్నాడు. అలాగే హీరోయిన్లు నయనతార, మమతామోహన్ దాస్ గ్లామర్ ని పంచనున్నారు.
Story first published: Wednesday, June 24, 2026, 5:02 [IST]