రజనీకాంత్ ఆరోగ్యం బావుంది, ఎలాంటి పుకార్లు నమ్మొద్దు: లతా
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం బాగానే ఉందని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని రజనీ సతీమణి లతా రజనీకాంత్ శుక్రవారం స్పష్టం చేశారు. రజనీ ఆరోగ్యం బాగా లేదని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె చెప్పింది. ఎవరూ ఎలాంటి పుకార్లు నమ్మవద్దని కోరింది. కాగా రానా సినిమా ప్రారంభం సందర్భంగా రజనీకాంత్ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో చెన్నైలోని ఇసాబెల్ హాస్పిటల్‌లో చికిత్స పొందారు.
రజనీకాంత్ వారం రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందారు. అయితే రజనీ ఆరోగ్యం విషమించిందని కొన్ని పుకార్లు వచ్చాయి. దీంతో రజనీ భార్య లతా రజనీకాంత్ స్పందించి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











