బోయపాటి శ్రీను గురించి రజనీకాంత్ ఎంక్వైరీ
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా బాలకృష్ణ నటించిన సింహా చిత్రం ప్రత్యేకంగా షో వేయించుకుని చెన్నైలో చూడటం జరిగింది. అనంతరం బాలకృష్ణకు ఫోన్ చేసి కంగ్రాంట్స్ చెప్పారు. అంతటి వండ్రఫుల్ హిట్టవటం గ్రేట్ అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆ చిత్రం రూపొందించిన దర్శకుడు బోయపాటి శ్రీను గురించి అడిగారు. ఆ విషయం తెలుసుకున్న బోయపాటి ఆనందానికి అంతులేదు. ఇక విజయోత్సాహంలో ఉన్న బోయపాటి..కె.ఎస్.రామారావు నిర్మాతగా ఎన్టీఆర్ హీరోగా చిత్రం అంగీకరించారు. అలాగే బాలకృష్ణ..దాసరి కాంబినేషన్లో పరమ వీర చక్ర చిత్రం రూపొందనుంది. ఇక రజనీకాంత్..శంకర్ తో చేస్తున్న రోబో చిత్రం హడావిడిలో బిజీగా ఉన్నారు.
రజనీకాంత్ బోయపాటి శ్రీను సింహా బాలకృష్ణ నమిత నయనతార రోబో శంకర్ rajinikanth boyapati srinu simha namitha nayantara robo


Click it and Unblock the Notifications