మరింత స్టైలిష్ గా కనిపిస్తున్నసూపర్ స్టార్...!?
సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం కారణంగా వైద్యం కోసం సింగపూర్ వెళ్ళటం జరిగింది. అక్కడి వైద్యంతో రజినీ ఆరోగ్యం కుదుటపడిందని ఆయన కోలుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే ఆయన ఎలా ఉన్నారు అన్నదానిపై తమిళనాడులో ఒక ప్రచారం జరిగింది. ఆయన బరువు తగ్గారని వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై రజినీకాంత్ అల్లుడు ధనుష్ స్పందిస్తూ...రజినీకాంత్ బరువు తగ్గారని వస్తున్న వార్తలు అవాస్తవం...ఆయన ఇదివరకు కంటే ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారని వివరించాడు. ప్రస్తుతం రజినీ సింగపూర్ లోనే రెగ్యులర్ చేకప్స్ చేయించుకుంటున్నారు. త్వరలోనే ఆయన ఇండియాకి రానున్నారని సమాచారం.
అయితే ట్రీట్ మెంట్ తీసుకొని, ఆరోగ్యంగా ఉంటూ అక్కడే అన్ని సదుపాయాలు ఉన్న ఒక మంచి ప్లాట్ లో ఉంటూ పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎప్పుడు షూటింగ్ లో బిజీగా ఉండే రజనీకాంత్ ఒంటరిగా ఒక్కడే ప్లాట్ లో గడపలేకపోతున్నాడు అసలే సూపర్ స్టార్...వచ్చే వారు పోయే వారితో కాలం తెలియకుండా గడుపుతూ ఉండే రజనీకాంత్ సింగపూర్ లో ఒంటరిగా ఉండటం బోర్ కొట్టి, తనే అందరికీ కాల్స్ చేసి సింగపూర్ కు రప్పించుకుంటున్నాడు. మూడు రోజల క్రితం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ కు ఫోన్ చేసి రప్పించుకొని శంకర్ తో కాలక్షేపం చేశారు...ఆ తర్వాత వెంటనే 'రానా" డైరెక్టర్ కెయస్ రవికుమార్ ను పిలించుకున్నారు..రానా గురించి నిర్విరామంగా చర్చించుకున్నారు ఎందుకంటే రజనీ డ్రీమ్ ప్రాజెక్ట్ 'రానా" అని అందరికీ తెలిసిన విషయమే..


Click it and Unblock the Notifications











