కమల్, రజనీ కాంబినేషన్ కన్ఫర్మ్...డైరక్టర్ ఎవరంటే
కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి మళ్ళీ నటిస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ కల నెరవేరే సమయం వచ్చింది. ఈ ప్రాజెక్టుకు రోబో నిర్మాత కళానిధి మారన్ శ్రీకారం చుట్టనున్నారు. ఎవరూ ఊహించని భారీ బడ్జెట్ ని దీనికి కేటాయించనున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని డైరక్టే చేసేది మరెవరో కాదు...శంకర్. సన్ పిక్చర్స్ ఆపీసులో గత నాలుగు రోజులుగా ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. రజనీ, కమల్ ఇద్దరూ కలిసి నటించటానికి ఉత్సాహం చూపుతున్నారని, అయితే ఇద్దరకి సరిపోయే కథ ఏమిటన్నదే శంకర్ ముందున్న పెద్ద ప్రశ్న అంటున్నారు. ఇక గతంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలసి అంతులేని కథ, అందమైన అనుభవం, వయసు పిలిచింది చిత్రాలు నిర్మించారు. ఇక ఈ భారీ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మితం కానున్నదని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం శంకర్..మహేష్ తో నిర్మించనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











