ఆ రోజు..ఒకే వేదికపై స్టార్ హీరోలు కమల్, రజనీకాంత్
రజనీకాంత్,కమల్ హాసన్ ఇద్దరూ ఒకే స్టేజీపై కనిపించి అభిమానులుకు కనువిందు చేయనున్నారు. తమిళ ప్రభుత్వం 2007,2008 సంవత్సరాలకు గానూ అవార్డులను ప్రకటించింది. వీటిలో రజనీకాంత్ శివాజీ చిత్రానికి బెస్ట్ యాక్టర్ రాగా, కమల్ తన దశావతారం చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు పొందింది. దాంతో ఇద్దరూ ఒకే సారి అవార్డు తీసుకోవటానికి స్టేజ్ ఎక్కనున్నారు. ఈ అవార్డుల ప్రధానం డిసెంబర్ ఎనిమిది,2009 నాడు జరగనుంది. ఇక ఈ అవార్డులను తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి తన స్వహస్తాలతో ఇవ్వనున్నారు. మద్రాస్ యూనవర్సటీ సెంచురీ బిల్డింగ్ లో ఈ అవార్డుల వేడుక జరుగుతుంది. ఇక బెస్ట్ యాక్ట్రెస్ గా జ్యోతిక, స్నేహ ఎంపికయ్యార.అదే స్టేజిపై కమల్, రజనీ గురువు బాలచందర్ కు సన్మానం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications