ఆ చిత్రంలో కమల్, రజనీ, శ్రీదేవి
కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ముగ్గురు కలిసి నటిస్తే ఎలా ఉంటుంది. ఎలా ఉన్నా ఇప్పుడున్న పరిస్ధితుల్లో అది సాధ్యమయ్యే పనిలా లేదు. అందుకేనేమో కార్తీ తాజా చిత్రంలో ఈ ముగ్గురు స్టార్స్ పేర్లూ ఉపయోగించారు. అందులో కార్తీ,సంతానం(హాస్య నటుడు) పేర్లు రజనీకాంత్,కమల్ హాసన్ అని పెట్టారు. అలాగే హీరోయిన్ ప్రణీత పేరుని శ్రీదేవి అని పెట్టారు. వీరి మద్య వచ్చే సన్నివేశాలు,డైలాగులు టప్పట్లు కొట్టిస్తాయంటున్నారు. సెటైర్ తో నడిచే కామిడీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు ఎన్.శంకర్‌దయాళ్ మాట్లాతుతూ.."ఇది పొలిటికల్ సెటైర్ మూవీ, ఓ ట్రావెల్‌లాగా ఉంటుంది, కార్తీ పాత్రలో చాలా వైవిధ్యత ఉంటుంది'' అని అన్నారు.
'ముందుగా టైటిల్ పెట్టినప్పుడు భయపడ్డాను. పూర్తిగా కథ విన్నాక.. శకుని కాదు శ్రీకృష్ణ పరమాత్మ పోలికలు ఉన్న రోల్ ఉంటుందని తెలుసుకున్నా. ఇందులో చాలా గెటప్స్ ఉంటాయి. ఇరవై నిముషాలకొక ట్విస్ట్ వస్తుందని హీరో కార్తి చెబుతున్నాడు...ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. సంతానం, రాధిక, కోట శ్రీనివాసరావు, రోజా, నాజర్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సాహితి, కెమెరా: పి.జి.ముత్తయ్య, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: ప్రేమ్క్ష్రిత్, బాబా భాస్కర్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్


Click it and Unblock the Notifications











