యంగ్ హీరోలకు రజనీకాంత్ సూచన
చెన్నై : ''ఇప్పటి యువ హీరోలు ఏడాదికి ఒక సినిమాలో మాత్రమే నటిస్తున్నారు. అలా కాదు.. యేటా రెండు, మూడు చిత్రాలు చేయాలి. ఒకటి నిరాశపరిచినా మిగిలినవి వెన్ను తడుతాయి''అన్నారు రజనీకాంత్. నటుడు ప్రభు కుమారుడు విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం 'గుమ్కి' ఆడియో విడుదల కార్యక్రమం గురువారం చెన్నైలో జరిగింది. రజనీకాంత్, కమల్‌హాసన్, సూర్య, కార్తి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ...''కమల్‌కి హాలీవుడ్ నుంచి ఆహ్వానం రావడం ఎంతో ఆనందంగా ఉంది. అందరికీ గర్వకారణమైన విషయమిది. ఆయన వల్ల భారత చిత్రపరిశ్రమకు కీర్తిప్రతిష్ఠలు దక్కుతున్నాయి. నేను సింగపూర్‌లో చికిత్స పొందుతుండగా చూడటానికి కమల్ వచ్చారు. వైద్యులు అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని నా కుమార్తెలు చెప్పారు. చెన్నై వచ్చిన వెంటనే మొదట కమల్‌కే ఫోన్ చేసి మాట్లాడాను'' అన్నారు.
ఇక రజనీకాంత్,కమల్ హాసన్ మంచి మిత్రులు. వీరిద్దరూ దర్శకులు బాలచందర్ శిష్యులు. ఎప్పట్నించో కమల్, రజనీకాంత్‌లు కలిసి నటిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో ఆ మిత్రులిద్దరూ ఒకే వేదికను పంచుకోవటం అబిమానలుకు ఆనందమైంది. ఇక వారు గతంలో కలిసి చేసిన సూపర్ హిట్ చిత్రం రి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
కమల్‌హాసన్, రజనీకాంత్ కలిసి 33 సంవత్సరాల కిందట నటించిన సూపర్ హిట్ చిత్రం 'అందమైన అనుభవం'. ఈ సినిమాకి డిజిటల్ హంగులు అద్దబోతున్నారు.
'అందమైన అనుభవం'ను స్కోప్‌లోకి మార్చి, స్టీరియో సౌండ్‌లో సినిమాను మరోమారు విడుదల చేయాలని దర్శకుడు కె.బాలచందర్ భావిస్తున్నారు. 'కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు' అనే హిట్ గీతం ఈ చిత్రంలోనిదే. రజనీకాంత్, కమల్‌హాసన్ వీరిద్దరూ కలిసి తొలినాళ్లలో చాలా సినిమాలు చేశారు. 1979లో వచ్చిన 'అందమైన అనుభవం' వీరి కలయికలో ప్రత్యేకమైనదిగా పేర్కొనాలి. వీరిద్దరికీ గురువైన కె.బాలచందర్ తెలుగు, తమిళ భాషల్లో దీన్ని రూపొందించారు. జయసుధ, జయప్రద, శరత్‌బాబు ఇత్యాది తారలంతా నటించారు. కథాకథనాలు, రజనీ, కమల్‌ల నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.


Click it and Unblock the Notifications











