రజనీకాంత్, రహ్మాన్ ల ఆడియో ఎంథిరాన్ విడుదల
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ తార ఐశ్వర్యరాయ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఎంథిరన్' ఆడియోను మలేషియాలోని పుత్రాజయలో అట్టహాసంగా విడుదల చేశారు. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఎంథిరన్ చిత్రానికి ఎఆర్ రహ్మాన్ సంగీతాన్ని అందించారు.
తెలుగులో రోబో పేరుతో రానున్న ఎంథిరన్ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. కౌలాలంపూర్‌లోని పుత్రాజయ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్, సినీగేయరచయిత వైరముత్తు, సన్ టీవీ అధినేత కళానిధి మారన్, తమిళ్ స్టార్ జయం రవి, రాధారవి, రమ్యకృష్ణలు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











