రజనీకాంత్ ‘విక్రమ్ సింహా' విడుదల తేదీ ఖరారు
చెన్నై : త్వరలో 3డీ చిత్రంతో సందడి చేసేందుకు రజనీకాంత్ సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించిన చిత్రం 'కోచ్చడయాన్'. ఈ సినిమా తెలుగులో 'విక్రమసింహ'గా అనువాదమవుతోంది. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాత మురళీ మనోహర్ చెన్నైలో వెల్లడించారు. భారీ ఎత్తున విడుదల చేస్తామని, అభిమానులు ఆనందించే విధంగా సినిమా రూపొందుతోందని ఆయన వెల్లడించారు. దీపికా పదుకొణె హీరోయిన్ . రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మొదట రజనీ జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 12న విడుదల చేయాలని భావించారు. అయితే సాంకేతికపరమైన హంగులు అద్దే క్రమంలో చిత్రం విడుదల ఆలస్యమవుతోంది.
'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని ఈ దీపావళికి విడుదల చేస్తామని అభిమానులకు మాటిచ్చారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కొచ్చాడయాన్ చిత్రం విడుదల లేటవుతోంది.


Click it and Unblock the Notifications











