మల్లిక విషయం సెటిల్ చేసిన రజనీ

By Staff

Rajini Kanth
మొత్తానికి బాలీవుడ్ శృంగార తార మల్లిక షెరావత్‌పై డ్రస్ కోడ్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.అయితే ఈ వివాదంలో దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ జోక్యం చేసుకుని సమస్యను సానుకూలంగా పరిష్కరించారు.కమలహాసన్ సినిమా 'దశావతారం' ఆడియో వేడుకకు కురచ దుస్తుల్లో వచ్చింది.దాంతో ఆ అలా రావటం వల్ల తమిళ ప్రజల మనోభావాల్ని, తమిళ సంస్కృతిని దెబ్బ తీసిందనేది తమిళనాడుకు చెందిన హిందు మక్కళ్ కచ్చి అనే హిందూ సంస్థ మల్లికా పొలీసు కేసు పెట్టింది. అంతేకాదు...తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఎదుట కాలు మీద కాలేసుకుని కూర్చుని అమర్యాదకరంగా ప్రవర్తించిందని కూడా అది తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది.దాంతో ఈ వివాదం ఎక్కడికి దాకా వెళ్తుందో అని అందరిలో ఒక విథమైన టెన్షన్ ప్రారంభమయ్యింది.

అవసరమైనప్పుడల్లా ప్రజలకు సాయం చేయడంలో పేరుపొందిన రజనీ ఈ వ్యవహారంలో తనంత తానుగా జోక్యం చేసుకుని తనతో మాట్లాడవలసిందిగా ఆ సంస్థకు కబురుపంపారు. తమిళనాడుకు అతిథి హోదాలో వచ్చిన మల్లిక పట్ల అలా వ్యవహరిస్తే రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందని వారికి నచ్చజెప్పారు. దాంతో రజనీ మాటల్ని గౌరవిస్తూ ఆ సంస్థ తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. మల్లిక హాయిగా ఊపిరి పీల్చుకుని రజనీకి మనసులోనే కృతజ్ఞతలు తెలిపింది.యేదైమైనా నిజానికి కమల్ కలుగ చేసుకోవాల్సిన విషయంలో రజనీకాంత్ పెదరాయడులా వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించటం అందరిని ఆనందపరిచింది.ఆయన గొప్పతనం మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X