ఫ్యాన్ కోసం: ఎయిర్ టిక్కెట్ పై రజనీ ఆటోగ్రాఫ్...(ఫొటోలు)

By Srikanya

చెన్నై: రజనీకాంత్ కు ఉన్న వీరాభిమానుల సంగతి తెలిసిందే. ఆయన్ను ఓ సారి కలిస్తే చాలు...ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుంటే ఇంక ఆ ఆనందమే వేరు అని ఫ్యాన్స్ భావిస్తుంటూరు. అందుకు తగినట్లే రజనీకాంత్ సైతం....తాను సూపర్ స్టార్ ని అనే భావం లేకుండా భేషజాలకు పోకుండా మసులుకుంటూంటారు. రీసెంట్ గా ఓ సంఘటన ఇప్పుడు రజనీ అభిమానులను ఆనందంలో ముంచేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శ్రీనివాస్ అనే వీరాభిమాని..చెన్నై ఎయిర్ పోర్ట్ లో రజనీకాంత్ ని చూసారు. అతని ఆనందం చెప్పలేనంత. చాలా కాలంగా ఆయన్ను కలవాలి అనుకుంటున్నా సాధ్యపడటం లేదు. అలాంటిది ఎదురుగా వచ్చి కనపడితే ఇక చెప్పేదేముంది. దాంతో వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి...తలైవా నాకు నీ ఆటోగ్రాఫ్ కావాలి అన్నాడు. కాని అతని దగ్గర ఓ కాగితం కూడా లేదు.

Rajini signs autograph on air-ticket for fan

విషయం అర్దం చేసుకున్న రజనీ..వెంటనే అతని దగ్గర ఉన్న జెట్ ఎయిర్ వేస్ ... టిక్కెట్ ని తీసుకుని దానిపై సంతంకం చేసి ఉచ్చారు. గాడ్ బ్లెస్ యు అని రాజి ఇచ్చారు. ఇది చూసిన శ్రీనివాసన్ ఆనందంతో తన ట్విట్టర్,ఫేస్ బుక్ ఎక్కౌంట్ లలో దీన్ని పోస్ట్ చేసారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు అవే. ఇప్పుడు రజనీ సంతకం పెట్టిన ఆటోగ్రాఫ్ ...సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో వైరల్ లాగ దూసుకుపోతోంది.

రజనీ చిత్రాల విషయానికి వస్తే...

లింగ సినిమా తరువాత సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. తదుపరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉంటుందనే చర్చ కొంతకాలంగాగా సినీ వర్గాల్లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. లింగ ఫెయిల్యూర్ తో కసిగా ఉన్న ఈ స్టార్ హీరో.. తన నెక్ట్స్ మూవీ ఎలాగైనా బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఉండాలని భావిస్తున్నాడట. ఇప్పటికే కొందరు స్టార్ డైరెక్టర్లు రజనీతో సినిమా తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని చెన్నైలో చర్చ జరుగుతోంది.

Rajini signs autograph on air-ticket for fan

రజనీకాంత్ తో రోబో వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన దర్శకుడు శంకర్.. ఆ సినిమా సీక్వెల్ ను కూడా రజనీతోనే ప్లాన్ చేస్తున్నాడని కొందరు చెబుతున్నారు. ఇక తమిళంలో అనేక సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు మురుగదాస్ సైతం.. రజనీకాంత్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. శంకర్, మురుగదాస్ సహా పలువురు కోలీవుడ్ దర్శకులు రేసులో ఉన్న రజనీకాంత్ కొత్త సినిమా కోసం.. ఇప్పుడు ఓ కన్నడ దర్శకుడు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడని తెలుస్తోంది.

కన్నడంలో పలు విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు పవన్ వడియార్.. రజనీతో సినిమా తెరకెక్కించేందుకు ట్రై చేస్తున్నాడట. ఇప్పటికే పవన్ వడియార్ రజనీని కలిసి స్టోరీ వినిపించాడని.. అందుకు సూపర్ స్టార్ కూడా సానుకూలంగా స్పందించాడని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. అయితే పవన్ వడియార్ కు రజనీ సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తే... అది నిజంగా ఓ అద్భుతమే అవుతుందని కొందరు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X