బ్రేకింగ్ న్యూస్:రజనీకాంత్ ‘చిట్టి’ పార్ట్ 2...!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ని హీరోగా సంచలనాల దర్శకుడు శంకర్ దర్శకుడిగా రూపొంది ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియ జెప్పిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం 'రోబో'. గ్రాఫిక్స్ మాయాజాలంతో ఇండియా సినిమా చరిత్రలోనే హై బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 'రోబో' లో 'చిట్టి" అనే రోబోగా రజిని చేసిన సాహసాలను చూసి మైమరిచిపోయాం. ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే చిట్టి సాహసాలను రెండో భాగంగా తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెన్నై మీడియా కోడై కూస్తుంది.
రజిని, శంకర్ ల ద్వయం మరో సారి జత కట్టి 'రోబో' పార్ట్ 2 తియ్యాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రానికి కూడా అదే సాంకేతిక (రతనవేలు)వర్గంతోనూ, సన్ పిక్చర్స్, సూపర్ హిట్ సంగీతాన్నిఅందించిన ఎఆర్ రెహమాన్ తోనూ పనిచేయాలని అనుకుంటున్నారు. అయితే హీరోయిన్ గా ప్రపంచ సుందరి ఐశ్వర్యనా లేఖ ఆ లక్కీ ఛాన్స్ మరే ఇతర బాలీవుడ్ బ్యూటీ దక్కించుకుంటుందో వేచిచూడాల్సిందే. ప్రస్తుతం రతనవేలు రజనీ రానా కుకూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రజినీ 'రానా' చిత్రం చేసే పనిలోనూ, శంకర్ 3 ఇడియేట్స్ తెరకెక్కించే పనిలోనూ, మరో ప్రక్క రోబో2 సీక్వెల్ స్ర్కిప్ట్ తయారు చేడంతోనూ బిజిగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చవచ్చు అనేది లేటెస్ట్ న్యూస్...


Click it and Unblock the Notifications











