‘లింగా’ కోసం రిస్క్ చేస్తున్న రజనీకాంత్
హైదరాబాద్: ‘లింగా' చిత్రం కోసం రజనీకాంత్ మరోసారి రిస్క్ చేయడానికి సిద్దపడ్డాడు. కాస్త రిస్క్ అయినా ఫర్లేదు అంటూ రిస్కీ స్టంట్స్ చేయడానికి ఓకే చెప్పేసాడు. ‘లింగా' చిత్రం కోసం పని చేస్తున్న హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్ లీ విట్టేకార్ తెలిపాడు. "ఇంతకు ముందెన్నడూ ఇంతటి డేర్ డెవిల్ యాక్షన్ దృశ్యాలను కంపోజ్ చేయలేదు. ఇది చాలా సాహసోపేతమైన ఫైటింగ్ సీక్వెన్స్" అంటూ లీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆయన వీటికి సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నారు. త్వరలో వీటిని రజనీపై చిత్రీకరిస్తారు. అభిమానులను ఇవి ఎంతగానో అలరిస్తాయని అంటున్నారు.

‘లింగా' చిత్రంలో రజనికి జోడిగా అందాల భామలు అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కెఎస్. రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ నిర్మాతగా రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సౌత్ ఇండియాలో అత్యంత భారీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ, ఏ.అర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ...''మా బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం లింగా. సూపర్ స్టార్ రజనికాంత్ గారితో మేము చిత్రం చేయటం చాలా హ్యాపీగా ఉంది, అయన సరసన అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. రెహమాన్ సంగీతం, రత్నవేలు కెమెరా ఇలా భారత దేశంలో ఉన్నతమైన సంకేతిన నిపుణులతో ఈ చిత్రం చేస్తున్నాము. కెఎస్.రవి కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము, రవికుమార్, రజనికాంత్‌గారి కాంబినేషన్‌లో వచ్చిన ముత్తు, అరుణాచలం ఎంత పెద్ద విజయాలు సాధించాయో అందరికి తెలిసిందే ఈ సినిమా ఆ రెండు చిత్రాలని మించి ఉంటుంది. రెహమాన్ గారు అందించిన సంగీతం దీపావళి కి విడుదల చేసి, సినిమా ని సూపర్ స్టార్ రజని కాంత్ గారి పుట్టిన రోజున విడుదల చేస్తాము" అని అన్నారు.


Click it and Unblock the Notifications











