భలే భలే రజనీవోయ్ :పాస్ పోర్ట్ మర్చిపోయి

By Srikanya

చెన్నై: ఈ మధ్యకాలంలో నాని హీరోగా వచ్చిన భలే భలే మొగాడివోయ్ చిత్రం వచ్చింది. అది మతిమరుపు ప్రధానాంశంగా సాగుతూంటుంది. ఇప్పుడు రజనీని కూడా భలే భలే రజనీవోయ్ అనాల్సి వస్తోంది. ఎందుకంటారా..అయితే ఈ రోజు జరిగిన ఈ సంఘటన మీరు చదవాల్సిందే.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కబాలి'. ఈ ఫిబ్రవరి నుంచి ఈ చిత్ర షూటింగ్‌ మలేషియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ సోమవారం చెన్నై నుంచి మలేసియా వెళ్లాల్సి ఉంది.

ఉదయం 11.45 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో పాస్‌పోర్ట్‌ మర్చిపోయినట్లు తెలిసింది. దీంతో ఆయన, ఆయనతో పాటు ఉన్న కొందరు కంగారు పడిపోతుండడంతో ప్రయాణీకులకి రజనీ రియల్‌ లైఫ్‌ సినిమా చూసినట్లయింది.

Rajini turns up at airport without passport

ఇంతలో ఈ విషయం మీడియాకి, అభిమానులకి తెలియడంతో వారు కొద్దిసేపు హల్‌చల్‌ చేశారు. రజనీ వెంటనే తన సహాయకులకి ఫోన్‌ చేసి ఇంటి నుంచి పాస్‌పోర్ట్‌ తెప్పించి విమానం అందుకోగలిగారు. పాస్‌పోర్ట్‌ వచ్చే వరకు రజనీకాంత్‌తో పాటు నిర్మాత కలైపులి ఎస్‌.థాను కూడా కారులోనే ఉన్నారు.

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి' . తెలుగులోనూ అదే పేరుతో డబ్బింగ్ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం మలేషయాలో షూటింగ్ జరుపుకుంటోంది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంటే పిభ్రవరి 28 వరకు ఈ చిత్రం షూటింగ్ కంటిన్యూగా జరుగుతుందిని నిర్మత కలైపులి ఎస్ ధాను తెలిపారు.

అలాగే ...తమిళంలోను, తెలుగులోనూ మే నెలలో ఒకేసారి రిలీజ్ చేయ్యాడానికి ప్లాన్ చేస్తున్నారని, ఆడియోను ఏప్రిల్ లో విడుదల చేయ్యాడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు డైరక్టర్ పా.రంజిత్.

ఈ సినిమాలో రజనీ గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు వర్షన్ కు సంబందించి సంగీత దర్ళకుడు సంతోష్ నారాయన్, లిరిక్స్ రాసేది సిరివెన్నెల, చంద్రబోస్ మరియు అనంత శ్రీరామ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X