ఏం కర్మ(కధ)రా నాయనా...రజనీకి కొత్త తలనొప్పి

By Staff

Kathanayakudu
ఎంతో ఇష్టపడి కథాపరియంబోల్ రైట్స్ తీసుకుని పి.వాసు దర్శకత్వంలో రజనీ కుశేలన్ (కథానాయుకుడు)చిత్రం చేసిన సంగతి తెలిసిందే.అలాగే రజనీకాంత్ తన గురువు బాలచందర్ కి అభిమానంగా రెమ్యునేషన్ కూడా తీసుకోకుండా చేసారు. అయితే ఆయన అంత మంచితనానికి పోయినా ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ వారు ఊరుకున్నా,తీసుకున్న ధియోటర్స్ వారు గొడవకు దిగుతున్నారు. దీనిపై ఎగ్జిబిటర్స్ చర్చ నిన్న (సోమవారం) చెన్నైలో జర్గింది.

తమిళనాడులోని కాంచీపురం జిల్లా ధియోటర్స్ యజమానులు ఈ సినిమా నిమిత్తం తాము చాలా పొగొట్టుకున్నామని,టైటిల్ కి తగ్గట్లే తాము కుశేలన్ గా మారామని అంటున్నారు. ఈ సందర్భంగా తమకి న్యాయం జరగాలంటూ అంతా కలసి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నారు. వారు ఆ మొత్తాన్ని నిర్మాతలుగా వ్యవరించిన కవితాలయా ,సెవన్ ఆర్ట్స్ వారు రీ పే చెయ్యాలని అడగాలని నిర్ణయించుకున్నారు.

వారు సాయింత్రం మీడియా మీట్ పెట్టి ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చాలని లేకుంటే కుశేలన్ నిర్మాతలుకు భవిష్యత్ లో ఏ సినిమా తీసినా నాన్ కోపరేషన్ అమలు జరపాల్సి ఉంటుందని బెదిరిస్తున్నారు. అలాగే తమకి దాదాపు 25 కోట్ల దాకా నష్టం వచ్చిందని,అయితే ఇందులో రజనీకాంత్ పాత్రేమీ లేదని చెప్తున్నారు. ఇంతకు ముందు లాగే ఆయన తమకి( ఎగ్జిబీటర్స్) సాయం చేయమని అడగొచ్చు కానీ...రజనీ ముందే ఈ సినిమాలో తన పాత్ర 25 శాతం మాత్రమే అని చెప్పారని స్పష్టం చేస్తున్నారు. అయితే నిర్మాతలు ,తమిళ,తెలుగు రైట్స్ కొన్న పిరమిడ్ సాయిమీరా వారు పూర్తి స్ధాయిలో రజనీ పాత్ర సినిమాలో ఉంటుందని మిస్ గైడ్ చేసారని చెప్తున్నారు.

అయితే పిరమిడ్ సాయిమీరా వారు మాత్రం ఈ విషయంపై స్పందిచటానికి ఇష్టపడటం లేదు.అయితే వారు వరల్డ్ వైడ్ మార్కెట్ లో ఈ సినిమాని మంచి రేటుకే అమ్ముకున్నారని,రజనీ క్రేజ్ ని బాగానే క్యాష్ చేసుకున్నారని తెలుస్తోంది.

అయితే ఎగ్జిబీటర్స్ మాత్రం అతి తెలివిగా కర్ర విరక్కూడదు...పామూ చావకూడదు అన్న రీతిలో మాట్లాడుతున్నారు. రజనీది గోల్డెన్ హార్ట్ అని ఆయన్ని మేము తిరిగి డబ్బు వాపసు చెయ్యమని అడగమని,అయితే నిర్మాతలు నుండి ఆ డబ్బు తిరిగి ఇప్పించమని అడుగుతామని చెప్పి మరీ ఇరుకున పెడుతున్నారు.రజనీ ఈ కొత్త సమస్యను ఎలా ఫేస్ చెయ్యాలని ఆలోచనలో ఉన్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X