చెన్నైలో రజనీకాంత్, చిరంజీవి, వెంకటేష్ కలిసి...
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ నటీ, నటులు (1980 నుంచి ఉన్నవారు మాత్రమే) కలిసి ఓ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆగస్టు 29, 2010న ఈ పంక్షన్ జరిగింది. సుహాసినీ మణిరత్నం ఈ గెట్ టుగెదర్ ని ఏర్పాటు చేస్తే లిస్సీ ప్రియదర్శన్ హోస్ట్ గా వ్యవహరించారు. క్రితం సంవత్సరం అటెండ్ కాని మరో ఐదుగురు సూపర్ స్టార్స్ ఈ సారి కలివటం విశేషంగా భావిస్తున్నారు. ఆ స్టార్స్...చిరంజీవి, వెంకటేష్, మోహన్ లాల్, శరత్ కుమార్, అర్జున్. ఇక ఈ గెట్ టు గెదర్ కు మొత్తం 29 మంది సెలబ్రటీలు హాజరయ్యారు. వారిలో రజనీకాంత్, ప్రభు, కార్తీక్, మోహన్, సురేష్, సుమన్, నరేష్, బానుచందర్, ప్రతప్ పోతన్, ముఖేష్, శంకర్, అంబిక, సుహాసిని, సుమలత, పూర్ణిమ భాగ్యరాజ్, శోభన, లిస్సీ, రాధ, రేవతి, నదియా, రమ్య కృష్ణ, ఖుషుబు ఉన్నారు. ఇక ఆ సాయింత్రం మ్యూజిక్, పాటలు, డాన్స్ లు, నవ్వులుతో హ్యాపీ హ్యాపీగా గడిచిందని సమాచారం. ఇక రజనీకాంత్, చిరంజీవి ప్రత్యేకంగా ప్రక్కకు వెళ్ళి చాలాసేపు ముచ్చటించుకున్నారని తమిళ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











