రజనీ కొత్త చిత్రం ‘విక్రమసింహా’రిలీజ్ ఖరారు
చెన్నై : తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ నటిస్తున్న 'కోచడయాన్' చిత్రం తెలుగు వెర్షన్ 'విక్రమసింహా' టైటిల్ తో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలను రజనీకాంత్ పుట్టిన రోజున అంటే 12.12.2012న విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని తెలుగు వెర్షన్ నిర్మాత బి.సుబ్రమణ్యం ఖరారు చేసారు.
బి.సుబ్రమణ్యం మాట్లాడుతూ...రజనీకాంత్ నటించిన కొచ్చాడియాన్ చిత్రం ఆరంభంలోనే హక్కులు తీసుకున్నా. ఈ విషయం తెలిసి, రజనీకాంత్ కూడా ఆశ్చర్యపోయారు. 'ముందుగా గ్రహించి కొన్నారు' అని ప్రశంసించారు. ఈ చిత్రానికి 'విక్రమసింహ' అనే పేరు పరిశీలనలోఉంది ఇంకా ఫైనల్‌కాలేదు. రజనీకాంత్ పుట్టినరోజైన 12.12.2012న విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జపనీబాషలోకూడా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఆయన జపనీ బాష కూడా నేర్చుకోవడం విశేషం అన్నారు.
"రజనీకాంత్ గారితో ఓ సినిమా చెయ్యాలనేది ఎన్నేళ్లనుంచో నాకున్న కల. 'కొచ్చాడయాన్'తో అది నెరవేరుతోంది. అనువాద చిత్రాలకు డబ్బింగ్‌లో 'పెదాల కదలిక' చాలా కీలకం. ఆంగ్ల చిత్రమైనా తెలుగు చిత్రంగా ఉచ్చారణలో పెదాలను సింక్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడంతో మా బ్యానర్ చిత్రాలంటే తెలుగు సినిమా చూశామన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుంది'' అని చెప్పారు లక్ష్మీగణపతి ఫిలిమ్స్ అధినేత సుబ్రమణ్యం బి.
ఇక ఈ నెలలో 'యమధూతలు' అనే చిత్రాన్ని విడుదల చేయడం విశేషం. ఈనెల 24న విడుదల కానున్న ఈ చిత్రంలో అర్నార్డ్, జెట్లీ, వాండన్, అల్నాడ్‌షావెజ్ వంటి 11మంది యాక్షన్ హీరోలు నటించిన ఆ చిత్రం మా బ్యానర్‌కు రావడం గర్వంగా ఉంది. స్వతహాగా నాకు అడ్వంచర్ చిత్రాలంటే ఇష్టం. ఇప్పటివరకు 35 చిత్రాలను తమిళం, ఇంగ్లీషు, మలయాళం చిత్రాలను డబ్బింగ్‌చేశాను. ఈఏడాది స్ట్రెయిట్ తెలుగు సినిమా నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాం. మంచి కథాంశంతోకూడిన ఆ చిత్రం ఈ ఏడాది చివరల్లో చేయనున్నా అన్నారు.


Click it and Unblock the Notifications











