సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని సందర్శించుకుని ప్రార్థనలు చేశారు. రెండు భారీ ప్రాజెక్టులను ప్రారంభించడానికి ముందు ఆయన గురువారం తిరుమలేశుని దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణమైన ధోవతి, అంగీ ధరించి ఆయన ఒంటరిగానే తిరుమలకు వచ్చారు. అభిమానులకు చేతులు ఊపుతూ నవ్వులతో అభివాదం చేశారు. సంప్రదాయ పద్ధతిలో ఆయనకు దేవాలయాధికారులు స్వాగతం చెప్పారు. ఆయన చేత ప్రత్యేక పూజలు చేయించారు. ఒక గంట పాటు అక్కడ ఉండి ఆయన తన గదికి తిరిగి వెళ్లిపోయారు. రజనీకాంత్ తిరుమలకు రావడం ఈ ఏడాదిలో ఇది రెండో సారి. అయంగారన్, కె. బాలచందర్ సినిమాలపై అధికార ప్రకటన వెలువడడానికి ముందు ఆయన తిరుమలను సందర్శించుకున్నారు.
Story first published: Thursday, July 16, 2026, 22:56 [IST]