రీమేక్ మీద కన్నేసిన రజనీకాంత్..చర్చలు

By Srikanya

చెన్నై : రజనీకాంత్ ...త్వరలో ఓ రీమేక్ లో నటించే అవకాసం ఉందా...అంటే అవుననే వార్తలు తమిళ వర్గాల్లో వినపడుతున్నాయి. రీసెంగ్ గా ఆయన ముమ్మట్టి, నయనతార కాంబినేషన్ లో రూపొందిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం చూడటం జరిగిందని, దాంతో ఆ చిత్రం రీమేక్ చేస్తే బాగుంటుందని ఆసక్తి చూపుతున్నట్లు తమిళ వర్గాలు చెప్తున్నారు.

మళయాళంలో సిద్దికి(బాడీగార్డ్ డైరక్టర్) డైరక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో రజనీకి ప్రత్యేక స్క్రీనింగ్ వేసి చూపించారు. అయితే ఇందులో వివాహితుడుగా, ఓ బిడ్డకు తండ్రిగా రజనీ కనిపించాల్సి ఉంటుంది. అది అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారని చెప్పుకుంటున్నారు. రజనీ మాత్రం తన వయస్సుకు మ్యాచ్ అయ్యే సబ్జెక్టు అని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

Rajini wishes to remake Baskar The Rascal

భాస్కర్ ..ది రాస్కెల్ కథాంశం విషయానికి వస్తే...

భాస్కర్ (ముమ్మట్టి) పెద్దగా చదువుకోడు, చాలా ర్యాష్ గా ఉంటూంటాడు. కానీ మనస్సు మాత్రం చాలా మంచింది. తన తండ్రి పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి సంపాదించిన భాస్కర్ పెళ్లైన కొద్ది కాలంలోనే తన భార్యని పోగొట్టుకుంటాడు. తన కొడుకుతో ...ఓ పెద్ద బంగ్లాలో ఉంటూంటాడు భాస్కర్. తన తండ్రి ర్యాష్ గా ఉండి అందరితో తగువులు పడటం ఆ పిల్లాడికి ఇష్టం ఉండదు.

ఇక నయనతార విషయానికి వస్తే ఆమె చాక్లెట్స్ లు తయారు చేసే వ్యాపారం చేస్తూంటుంది. ఆమె కుమార్తె కూడా...భాస్కర్ కొడుకు చదువుతున్న స్కూల్ లోనే చదువుతూంటుంది. ఆమె కూడా ఒంటిరిగా ఉంటూంటుంది. ఇది గమనించిన పిల్లలు వారిని ఒకటిగా చేసి తన తల్లి, తండ్రులుగా మార్చుకోవాలనుకుంటారు. అయితే దీనికి నయనతార ఒప్పుకోదు. ఈ ప్రాసెస్ లో జరిగిన కామెడీనే కథాంశం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కొన్నాళ్లుగా శంకర్, కె.ఎస్.రవికుమార్ వంటి కోలీవుడ్ర్ డైరెక్టర్స్ క్యూలో ఉండగా.. వీరందరినీ కాదని... 'అట్టకత్తి', 'మద్రాస్' వంటి చిన్న చిత్రాలతో మెప్పించిన రంజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజనీకాంత్. తమిళ స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన అగ్రనిర్మాత కలైపులి థాను.. ఈ సినిమా నిర్మించనున్నారు. గతంలో థాను నిర్మించిన 'యార్' చిత్రంలో అతిథిపాత్ర పోషించిన రజనీకాంత్.. మళ్లీ ఇప్పుడు ఈ సంస్థలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు నిర్మాత థాను తెలియజేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కబోతోందట. సో.. పెదరాయుడు తర్వాత రజనీకాంత్ నటించనున్న స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కానుంది.

అయితే ఇప్పుడు తమిళంలో పెద్ద నిర్మాత అయిన జ్ఞానవేల్ రాజా ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నట్లు చెన్నై సినీ వర్గాల సమాచారం. ఎందుకంటే తమ స్టూడియో గ్రీన్ బ్యానర్ పై ...సూర్య హీరోగా ఓ చిత్రం డైరక్ట్ చేయటానికి రంజిత్ ఎగ్రిమెంట్ రాయటం జరిగింది. దాంతో ఇప్పుడు ఆ ఎగ్రిమెంట్ ని ఉల్లంఘించి...రజనీ ని డైరక్ట్ చేయటమేంటని ప్రశ్నిస్తున్నాడు జ్ఞానవేల్ రాజా.

ఈ మేరకు జ్ఞానవేల్ రాజా ఈ విషయాన్ని సైతం రజనీకాంత్ సమక్షానికి తెలియచేసినట్లు చెప్పుకుంటున్నారు. దాంతో దర్శకుడు రంజిత్ డీలా పడిపోయారు. ఎగ్రిమెంట్ ని కాదని రజనీతో సినిమా చేస్తే వారు ఒప్పుకునేటట్లు లేరు. అలాగని రజనీలాంటి సూపర్ స్టార్ హీరోతో ఒక్కసారి సినిమా చేసే అవకాసం మిస్తైతే ఇక మరోసారి ఇలాంటి అవకాసం రావటం కష్టం. ఈ విషయంలో రజనీ ఏం నిర్ణయం తీసుకుంటారు..ఏ విధంగా సమస్య పరిష్కారమవుతుందనే విషయమై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X