రజనీతో నటించే అవకాశం దొరకడం లక్: ఐష్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్ అన్నారు. రజనీ వంటి హీరోతో నటించడం ఎంతో అదృష్టమని, రజనీతో కలిసి నటించిన అవకాశం భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
శనివారం హైదరాబాద్‌కు విచ్చేసిన ఐష్..కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. భవిష్యత్‌లో తెలుగులో మంచి కథతో అవకాశం లభిస్తే మాత్రం తప్పకుండా నటిస్తానన్నారు. ముఖ్యంగా..సినిమా కెరీర్‌కు పెళ్లి ప్రతిబంధకం కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇకపోతే..వివాహం తర్వాత..తన పని తాను చేసుకుని పోతున్నా. ఇందుకు ప్రధాన కారణం..బచ్చన్ కుటుంబం తనకు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చి, సంపూర్తిగా సహకరిస్తున్నట్టు ఐశ్వర్యాయ్ తెలిపారు. ఇకపోతే..'రావణ' చిత్ర వివాదాలను మీడియా భూతద్దంలో పెట్టి చూపుతోందన్నారు.
rajini aishwarya ravana abhishek bachchan robo bollywood రజనీకాంత్ ఐశ్వర్యారాయ్ రావణ బాలీవుడ్ అభిషేక్ బచ్చన్ రోబో మణిరత్నం


Click it and Unblock the Notifications