రజనీకాంత్, నయనతార మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తలైవా 167 మూవీ ఎప్పుడంటే?
పేట్టా మూవీ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 10వ తేదీన మొదలైన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నది.
సూపర్ స్టార రజనీ కెరీర్‌లో 167వ చిత్రంగా రానున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్టు సమాచారం. తలైవా సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేసే దిశగా ప్లాన్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేయడం తెలిసిందే. సామాజిక కార్యకర్తగా, పోలీస్ అధికారిగా రజనీ కనిపించబోతున్నారు.

రజనీతో రూపొందించే సినిమా విజయం సాధించాలని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఇటీవల పళని మురగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించుకొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి సక్సెస్ సాధించాలని భగవంతుడిని ప్రార్థించినట్టు తమిళ మీడియాకు మురగదాస్ వెల్లడించారు.
గతంలో సూపర్ స్టార్ రజనీతో నయనతార నటించడం ఇది నాలుగోసారి. చంద్రముఖి, కథానాయకుడు, శివాజీ (గెస్ట్ అప్పీయరెన్స్) చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తలైవా 167 సినిమా కోసం జతకట్టింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











