twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    71ఏళ్ళ వయసులో రజనీకాంత్ 170వ సినిమా.. యువ దర్శకుడికి గోల్డెన్ ఛాన్స్?

    |

    కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా నేటి తరం యువ హీరోల తరహాలోనే శరవేగంగా సినిమాలను చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు. సాధారణంగా పెద్ద వయసు లోకి రాగానే నటీనటులు సినిమాలను తగ్గిస్తూ ఉంటారు కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం మరింత వేగాన్ని పెంచుతున్నారు.. బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో రజనీకాంత్ అనుకున్నంతగా విజయాలను అందుకోవడం లేదు. అయినప్పటికీ ఆయనకు భారీ స్థాయిలోనే ఓపెనింగ్స్ వస్తున్నాయి. వీలైనంతవరకు సేఫ్ జోన్ లోనే కమర్షియల్ సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. అయితే కొన్నేళ్ళ క్రితం వరకు రజనీకాంత్ ఎక్కువగా స్టార్ దర్శకులతో సినిమాలు చేస్తూ వచ్చారు.

    ఇక ఫైనల్ గా తరం యువ దర్శకులతో కూడా అయిన సినిమా ఎక్కువగా చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఒక్క హిట్ అందుకున్నా కూడా దర్శకుడు నచ్చితే వెంటనే సినిమాకు ఒప్పుకుంటున్నాడు. జయాపజయాలను లెక్క చేయకుండా వరుసగా డిఫరెంట్ సినిమాలను చేయలని అనుకుంటున్నారు. చివరగా మాస్ కమర్షియల్ దర్శకుడు శివ దర్శకత్వంలో పెద్దన్న అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి విజయాలను అందుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే 168 సినిమాలను ఫినిష్ చేసిన రజనీకాంత్ ఇక 169 వ సినిమా కోసం కూడా యువ దర్శకుడిని ఫైనల్ చేశాడు.

    Superstar Rajinikanth 170th projects with young director

    బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో రజనీకాంత్ 169వ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఇక 170వ సినిమా విషయంలో కూడా ఫైనల్ నిర్ణయానికి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా వార్తల ప్రకారం, తలైవర్ తన 170వ చిత్రాన్ని నెంజుకు నీది ఫేమ్ అరుణ్‌రాజా కామరాజ్‌తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బడా నిర్మాతతో నిర్మించనున్నట్లు సమాచారం. ఇక రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చూసి కూడా చాలా కాలం అయ్యింది. చివరగా రోబో అనంతరం తలైవా సరైన సక్సెఆ అయితే చూడలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంటున్నాయి. శంకర్ దర్శకత్వంలో చేసిన రోబో సీక్వెల్ 2.0 కూడా అంచనాలను అందుకోలేకపోయింది.
    ఆ తరువాత మురగదాస్ దర్శకత్వంలో చేసిన దర్బార్ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. తెలుగులో కూడా రజినీకాంత్ హిట్స్ చూసి చాలా కాలం అయ్యింది. ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద గతంలో మాదిరిగా రికార్డులను అందుకోవడం లేదు.

    ఇక ఆరోగ్యం సరిగా సహకరించకపోయినప్పటికి మొండిగానే షూటింగ్స్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అలాగే మరి కొన్ని కథలను కూడా ఫిల్ చేయాలి అని రజనీకాంత్ కొత్త దర్శకులను సంప్రదించినట్లు తెలుస్తోంది ఇక గతంలో ఆయన రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్న రజనీకాంత్ ఫైనల్ గా ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నట్లుగా వివరణ ఇచ్చేశారు. ఇక రాబోయే సినిమాలతో అయినా సక్సెస్ అందికుంటాడో లేదో చూడాలి.

    English summary
    Superstar Rajinikanth 170th projects with young director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X