మహేష్ ఏడేళ్ల రికార్డు గల్లంతు.. తొలిరోజు ప్రభంజనం దిశగా 2.0!
Recommended Video

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 చిత్ర హంగామా మొదలయింది. నవంబర్ 29 గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం రాత్రి నుంచే యుఎస్‌లో ప్రీమియర్స్ షోల సందడి మొదలవుతుంది. శంకర్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ని చూసేందుకు దేశ వ్యాప్తంగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత చలన చిత్ర సత్తాని ప్రపంచానికి తెలియజేసే చితం ఇది అంటూ విడుదలకు ముందే ప్రశంసలు అందుకుంటోంది. అందుకు తగ్గట్లుగానే భారీ స్థాయిలో విడుదలవుతోంది.

పదివేల స్క్రీన్స్‌లో
ప్రపంచ వ్యాప్తంగా 2.0 చిత్రం 10 వేల స్క్రీన్స్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. గతంలో ఏ ఇండియన్ మూవీ ఇన్ని స్క్రీన్స్ లో విడుదల కాలేదు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాను అనుకున్న విధంగా విజువల్ ఎఫెక్ట్స్ వచ్చే వరకు శంకర్ వదిలిపెట్టలేదు. బడ్జెట్ పెరుగుతున్నా లెక్క చేయకుండా సినిమాని తీర్చి దిద్దారు. సూపర్ విలన్ గా అక్షయ్ కుమార్, చిట్టి రోబోగా రజనీకాంత్ మధ్య మతిపోగోట్టే పోరాట సన్నివేశాలు ఉంటాయట.

తెలుగు రాష్ట్రాల్లో కూడా
తెలుగు రాష్ట్రాల్లో కూడా 2.0 చిత్రానికి భారీ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లుగానే విడుదల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో సరికొత్త రికార్డ్ నెలకొల్పనుంది. తొలి రోజు ఈ చిత్రానికి అత్యధికంగా ఐమాక్స్‌లో 35 షోలు ప్రదర్శించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు మహేష్ బాబు పేరిట ఉన్న ఈ రికార్డు తుడిచి పెట్టుకుపోనుంది.

ఏడేళ్లపాటు బిజినెస్‌మాన్ రికార్డు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ చిత్రం 2012 లో విడుదలై మంచి విజయం సాధించింది. అప్పట్లో మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ కు భారీ క్రేజ్ ఉండేది. తొలి రోజు ఈ చిత్రానికి ఐమాక్స్‌లో 33 షోలు ప్రేదర్శించారు. ఆ తరువాత వచ్చిన మహేష్ సినిమాలతో సహా మరే ఇతర హీరో చిత్రం ఈ రికార్డుని అధికమించలేదు. ఈ ఏడాది విడుదలైన భరత్ అనే నేను, రంగస్థలం చిత్రాలకు కూడా పరిమిత సంఖ్యలోనే తొలి రోజు షోలు ప్రదర్శించారు. ఏడేళ్ల తరువాత ఆ రికార్డుని రజనీకాంత్ 2.0 బ్రేక్ చేస్తుండడం విశేషం.

భారీ స్థాయిలో ఓపెనింగ్స్
2.0 చిత్ర ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండబోతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2.0 చిత్రం కోసం పిల్లలనుంచి పెద్దల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మంచి టాక్ వస్తే 600 కోట్లతో నిర్మించబడిన ఈ చిత్రం అంతకు మించి వసూళ్లు సాధించడం పెద్ద సమస్య కాకపోవచ్చు. అమీ జాక్సన్ ఈ చిత్రంలో హీరోయిన్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











