రజనీ 3D 'కొచ్చాడయాన్' స్టోరీ లైన్
రజనీకాంత్ తాజాగా'కొచ్చాడయాన్'అనే ఓ త్రీడీ చిత్రం కమిటైన సంగతి తెలిసిందే.తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్', 'ద అడ్వెంచర్ ఆఫ్ టిన్‌టిన్' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
ఇక 'రాణా'సినిమా రజనీకాంత్ చేయాలని ఆయన అనుకున్నా హెల్త్ సమస్యలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇక ఈ రోజు రజనీకాంత్ 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. సోమవారం రజనీకాంత్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు చెన్నైలోని ఆయన అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ వస్త్రధారణ, హావభావాలు, ఆహార్యం ఎప్పుడూ కొత్త శైలిలో ఉంటాయి కాబట్టి డిసెంబరు 12ని 'వరల్డ్ స్త్టెల్ డే'గా ప్రకటించాలని వారు కోరుతున్నారు.


Click it and Unblock the Notifications











