2.0 నుంచి తప్పుకొని.. డబ్బు తిరిగి ఇచ్చేద్దామనుకొన్నా.. 1000 కోట్లు కలెక్షన్లు గ్యారంటీ.. రజనీకాంత్

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 2.0 చిత్రం ట్రైలర్‌ను అట్టహాసంగా విడుదల చేశారు. చెన్నైలోని సత్యం సినిమాలో జరిగిన కార్యక్రమానికి జాతీయ మీడియాను ఆహ్వానించారు. ఈ వేడుకలో రజనీకాంత్ ఉద్వేగంగా చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకొన్నది. సినిమా షూట్ సమయంలో చోటుచేసుకొన్న విషయాలను ఆసక్తికరంగా అభిమానులకు చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే..

Recommended Video

2.0 Movie Trailer Launch Event 2.0 సినిమా ట్రైలర్ లాంచ్
శంకర్‌తో రెండుసార్లు పనిచేశా

శంకర్‌తో రెండుసార్లు పనిచేశా

దర్శకుడు శంకర్‌తో గతంలో రెండుసార్లు పనిచేశాను. 2.0 కథ చెప్పిన తర్వాత ఈ సినిమా ఆడుతుందా అని అడిగాడు. వెంటనే ఎవరు ఈ సినిమాను నిర్మిస్తున్నారని అడిగా. సుభాకరన్ అని చెప్పగానే.. సరైన వ్యక్తి చేతిలోనే ప్రాజెక్ట్ పెట్టావని చెప్పాను. దాంతో శంకర్‌కు ప్రాజెక్ట్‌పై మరింత నమ్మకం పెరిగింది.

శివాజీ సినిమా లాభాలపై స్టడీ

శివాజీ సినిమా లాభాలపై స్టడీ

సినిమా నిర్మించడానికి ముందు సన్ నెట్ వర్క్ తీసిన శివాజీ చిత్రం మంచి లాభాలను తెచ్చిపెట్టింది. శివాజీ బిజినెస్‌పై కళానిధి మారన్ పూర్తిగా అధ్యయనం చేశారు. ఆ తర్వాతనే సినిమా చేయడానికి ముందుకొచ్చారు. లాభాలు సంపాదించాలన్నది ఆయన ఉద్దేశం కాదు. పెట్టిన డబ్బైన వస్తుందా అనే కోణంలో బిజినెస్‌పై అంచనాకు వచ్చారు.

బడ్జెట్ పెరిగి 600 కోట్లకు చేరింది

బడ్జెట్ పెరిగి 600 కోట్లకు చేరింది

2.0 సినిమా కోసం రూ.350 కోట్ల అంచన బడ్జెట్‌తో సినిమా షూటింగ్ ప్రారంభించాం. పలుమార్లు షూటింగ్ ఆగిపోయి సినిమా ఆలస్యం కావడంతో బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. చివరకు రూ.600 కోట్లు ఖర్చు అయ్యాయి. ఖర్చు ఎంతైనా సరే ఈ సినిమా అంతకు రెండు రెట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది అని రజనీ ధీమా వ్యక్తం చేశారు.

 తీవ్ర అనారోగ్యానికి గురై

తీవ్ర అనారోగ్యానికి గురై

రోబో 2.0 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. డూప్ పెట్టి సీన్లు షూట్ చేయడానికి శంకర్ ఒప్పుకోలేదు. నేను కోలుకోవడానికి సుమారు 5 నెలలు పట్టవచ్చని చెప్పాను. అయితే మీ ఆరోగ్యమే నాకు ముఖ్యమని నిర్మాత చెప్పారు. నాలుగు నెలలు కాదు.. నాలుగేళ్ల తర్వాత కూడా తిరిగి వచ్చిన మేము వేచి ఉంటామన్నారు. అలాంటి నిర్మాత నాకు మంచి స్నేహితుడి రూపంలో దొరకడం నిజంగా అదృష్టమే.

నాపై నేనే విశ్వాసాన్ని కోల్పోయా

నాపై నేనే విశ్వాసాన్ని కోల్పోయా

అనారోగ్యం నుంచి బయటపడిన తర్వాత షూటింగ్ ప్రారంభించాం. ఆరోగ్యం పూర్తిగా సహకరించకపోవడంతో ఒక్కో సీన్ కోసం 8 టేకులు తీసుకొనే వాడిని. ఓ దశలో నేను నాలో విశ్వాసాన్ని కోల్పోయాను. సినిమా నుంచి తప్పుకొంటానని ఓసారి శంకర్ చెప్పాను. నేను తీసుకొన్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తానన్నాను. సినిమాకు నా వల్ల అయిన ఖర్చును భరిస్తానని కూడా చెప్పాను. అయితే శంకర్, సుభాకరన్ ఏ మాత్రం ఒప్పుకోలేదు అని రజనీకాంత్ ఈ సందర్బంగా చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X