2.0 సూపర్ డూపర్ హిట్.. రాసుకోండి.. రాజమౌళి గురించి రజనీ సెన్సేషనల్ కామెంట్

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 2.0 సినిమా ట్రైలర్ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. చెన్నై సత్యం సెంటర్లలో జరిగిన 2..0 ట్రైలర్ రిలీజ్ వేడుకకు రజనీ, శంకర్ కుటుంబ సమేతంగా తరలివచ్చారు. భార్య లతతో రజనీ రాగా, శంకర్ తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో వేదిక వద్దకు వచ్చారు. అక్షయ్ కుమార్ రాకతో వేదిక వద్ద అలజడి చోటుచేసుకొన్నది. ఈ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ.. శంకర్, అక్షయ్ కుమార్, నిర్మాత సుభాష్, దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చెప్పిన విషయాలు..

Recommended Video

2.0 Movie Trailer Launch Event 2.0 సినిమా ట్రైలర్ లాంచ్
2.0 సూపర్ డూపర్ హిట్

2.0 సూపర్ డూపర్ హిట్

రోబో 2.0 సినిమా గురించి ఓ మాట చెబుతున్నాను. మీరు రాసుకొండి. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా సక్సెస్ కోసం ముందుగానే శంకర్, నిర్మాత సుభాష్ కరన్ కు కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమా సక్సెస్‌కు క్రెడిట్ నిర్మాత సుభాష్ కరణ్‌కు ఇస్తాను.

నా ప్రతిభను పరీక్షించడానికి కాదు..

నా ప్రతిభను పరీక్షించడానికి కాదు..

ఈ సినిమా రజనీకాంత్‌ను ప్రతిభను పరీక్షించడానికో, అక్షయ్ కుమార్ టాలెంట్ పరీక్షించడానికో సుభాస్ సినిమా తీయలేదు. కేవలం శంకర్ టాలెంట్‌ను, మేనేజ్‌మెంట్‌ను పరీక్షించడానికి సుభాష్ రూ.600 కోట్లు ఖర్చు చేశారు. ఆయన గట్స్‌కు నేను అభినందిస్తున్నాను. శంకర్ మేజిషియన్, అద్బుతమైన టెక్నిషియన్, ఇండియన్ టామ్ క్రూయిజ్ అంటూ శంకర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

శంకర్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు

శంకర్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు

శంకర్ తన కెరీర్‌లో ఎప్పడూ ఫెయిల్ కాలేదు. ఆడియెన్స్ వినోదాన్ని అందించడంలో ఎప్పుడు గురితప్పలేదు. ప్రేక్షకుల అంచనాలను ఎప్పుడూ నిరాశపరచలేదు. నిర్మాతలను నష్టానికి గురిచేయలేదు. ఆయన గొప్ప ఫిలింమేకర్, షో మ్యాన్, మెజిషియన్, ఇండియన్ స్పీల్ బర్గ్. చాలా కష్టమైన సీన్లు, షాట్లను చాలా సులభంగా తెరకెక్కించారు.

 2.0 చిత్రంలో మ్యాజిక్..

2.0 చిత్రంలో మ్యాజిక్..

రూ.600 కోట్లు పెట్టి తీశామనో. మూడు సంవత్సరాలు తీశామనో, లేదా టెక్నికల్ ఎక్సలెన్స్ ఉందనో.. మరేదో ఉందనో హిట్ అవుతుందని భావించకూడదు. ఈ సినిమాలో ఓ మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ సినిమాను సూపర్ డూపర్ హిట్ చేస్తుంది.

ప్రపంచస్థాయికి శంకర్

ప్రపంచస్థాయికి శంకర్

2.0 థ్రిల్లర్. ఎంటర్‌టైనర్. మంచి సందేశం ఇచ్చే గొప్ప సినిమా. ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. సూపర్ హిట్ అవుతుంది. తమిళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది. జాతీయ స్థాయిలో సినిమా ఆదరణ చూరగొట్టుంది. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వందశాతం గ్యారంటీ ఇస్తున్నాను.

రిలీజ్ అవుతుందా అనే రూమర్లపై

రిలీజ్ అవుతుందా అనే రూమర్లపై

2.0 సినిమా రీలీజ్‌కు ముందు చాలా రూమర్లు వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే సందేహాలను వ్యక్తం చేశారు. సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. నిర్మాతపై భారం పడకుండా ప్రమోషన్ సరిగా చేయడం లేదు. ఇంకా చాలా మాటలు వినిపించాయి. కానీ ఒక్కటే చెబుతున్నాను. సినిమా చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు ఈ సినిమాను ప్రమోట్ చేస్తారు అని రజనీ ఉద్వేగం ప్రసంగించారు.

శంకర్, రాజమౌళి, హిరాణి

శంకర్, రాజమౌళి, హిరాణి

భారతీయ సినిమా రంగంలో శంకర్, రాజమౌళి, రాజ్ కుమార్ హిరాణి గొప్ప దర్శకులు. భారతీయ సినిమా ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనులు. 2.0 చిత్రం కూడా ప్రపంచ సినిమాను షాక్ గురిచేస్తుంది అని రజనీకాంత్ అన్నారు. 2.0 గురించి శంకర్ సార్ కంగ్రాట్స్ అని రజనీకాంత్ అన్నారు.

అక్షయ్ కుమార్ గురించి

అక్షయ్ కుమార్ గురించి

ఇక అక్షయ్ కుమార్ అద్భుతమైన పాత్రలో కనిపిస్తారు. పాత్ర కోసం నాలుగు గంటలపాటు కష్టపడి మేకప్ వేసుకోవడం ఆయన సహనానికి నిదర్శనం. ఆయనతో కలిసి పనిచేయడం గొప్పగా భావిస్తాను అని ప్రసంగాన్ని ముగించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X