»   » తన దర్శకులు,తోటి హీరోలపై రజనీ కామెంట్స్ (ఫోటో ఫీచర్)

తన దర్శకులు,తోటి హీరోలపై రజనీ కామెంట్స్ (ఫోటో ఫీచర్)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై : రజనీకాంత్‌కు సంబంధించిన విశేషాలు ఎంత తెలుసుకున్నా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. వాటిని తెలుసుకునేందుకు అభిమానులు ఇప్పటికీ అమితాసక్తి ప్రదర్శిస్తుంటారు. ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా రజనీకాంత్‌ గురించి సినీ ప్రముఖులు కొందరు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే రజనీ వారి గురించి ఏమనుకుంటున్నారు. రజనీకాంత్‌ కూడా తన సహచరుల గురించి కొన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నారు. అవేమిటో తెలుసుకుందామా...

  అలాగే రజనీ ఏం చెప్పినా సంచలనమే...ఆయన రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ ''రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుతున్నారు. అయితే అలాంటి ఉద్దేశమే లేదు. 1996లో రాజకీయంగా విపత్కర పరిస్థితి నెలకొన్నప్పుడు అందులో చిక్కుకోకూడదని అమెరికా వెళ్లాను. అయితే కొందరు రాజకీయ ప్రముఖులు తనను సంప్రదించి 'ఇప్పుడు మీరు స్పందించకుంటే పిరికిపందగా చూస్తారు' అన్నారు. భిక్షమైనా ఎత్తుకుంటాను కానీ పిరికివాడిగా ఉండనని సమాధానమిచ్చి అందుకు అనుగుణంగా ప్రకటన చేశాను. ఆ ప్రకటనతో ఐదేళ్లపాటు వారిని ఆదరించాల్సిన పరిస్థితి నెలకొంది. రాజకీయాల్లో రాణించడం అంత సామాన్యమైన విషయం కాదు'' అన్నారు.

  ఇక రజనీకాంత్‌ నటించే సినిమాల్లో ఓ స్త్టెల్‌ ఉంటుంది. వాటిల్లో ఆయన నోట్లోకి సిగరెట్‌ ఎగరేసే సన్నివేశం బాగా ప్రాచుర్యం పొందింది. దాన్ని చాలామంది యువత అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే రజనీ ఇటీవల ఆయన అభిమానులకు పొగ తాగడం మానేయమని హితబోధ చేశారు రజనీకాంత్‌ మాట్లాడుతూ... ''దయ చేసి పొగ తాగడం మానేయండి. ఎక్కువగా పొగ తాగడం వల్లే నాకు కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చాయి. దేవుడి దయ వల్ల, మీ ఆశీర్వాద బలంతో ఆ సమస్య నుంచి బయటకొచ్చాను'' అన్నారు.

  తన గురువు బాలచందర్ గురించి చెప్తూ... 'ఫ్రెండ్‌ లైక్‌ ఫాదర్‌-ఫాదర్‌ లైక్‌ ఫ్రెండ్‌..' అంటూ ఆంగ్లలో చెబుతారుగా! ఆ కోవలో బాలచందర్‌ గురించి చెప్పాలంటే 'ఫాదర్‌ లైక్‌ గురు-గురు లైక్‌ ఫాదర్‌' అనొచ్చు. ఈయన లేకుంటే శివాజీరావ్‌గా ఉన్న నేను రజనీకాంత్‌ అయ్యేవాణ్ని కాదు. వెండితెరకు మాత్రమే కాదు.. జీవితానికి సంబంధించిన సలహాలను కూడా నేను నా గురువు వద్దే పొందుతాను. ఈయన గురించి చెప్పాలంటే మాటలు చాలవు. పుస్తకాన్ని రచించొచ్చు. అన్నారు.

  కమల్‌హాసన్‌ అనుకుని ఉంటే నిర్మాతలను నిర్భందించి నాకు సినిమాలు లేకుండా చేసి ఉండొచ్చు. అయితే అలా చేయలేదు. కొందరు నిర్మాణదారులను ఆహ్వానించి ఈ చిత్రంలో రజనీకాంత్‌కు అవకాశమివ్వండని సూచించిన రోజులు ఉన్నాయి. ఆయన లేకుంటే నేను ఇక్కడ నిలదొక్కుకునేవాణ్ని కాదు. కళామతల్లిను ఒక ప్రశ్న వేశాను. 'మేము కూడా నటిస్తూనే ఉన్నాము. కమల్‌హాసన్‌కు మాత్రమే ఎందుకు అంతటి అంతస్తుని ఇచ్చారని' అడిగాను. అందుకు సమాధానంగా 'మీరంతా ఈ జన్మలోనే నటులు. కమల్‌హాసన్‌ ఏడు జన్మల నుంచి నటుడే. అందుకే ఆయనకు ఆ హోదా అని చెప్పారు'.

  తమిళనాడు రాజకీయాల్లో నిలదొక్కుకుంటున్న విజయ్ కాంత్ గురించి... రాజకీయమన్నది విషపరీక్ష. నేను అందులోకి రావాలనే విషయమై చాలా చర్చలే జరిగాయి. కొందరు ఏకంగా నేను అడుగుపెట్టాననే అభిప్రాయానికి వచ్చారు. అయితే తమ్ముడు విజయ్‌కాంత్‌ మాత్రం చాలా అనుభవంతోనే వచ్చారు. తొలి ఎన్నికల్లో ఒకేఒక్కడుగా నిలిచినా ఏమాత్రం ధైర్యం కోల్పోక ముందుకు సాగి ప్రస్తుతం మంచి స్థానానికి చేరుకున్నారు. తమ్ముడు విజయ్‌కాంత్‌కు నా శుభాకాంక్షలు

  తన కుటుంబంలో వ్యక్తిగానే ప్రభు నన్ను చూస్తాడు. నేనూ ప్రభును అలానే భావిస్తాను. ఆయన కుమారుడు విక్రమ్‌ ప్రభు పరిచయ చిత్రం 'గుమ్కీ' ఆడియో వేడుకకు వెళ్లకూడదనే అనుకున్నాను. అయితేఅక్కడికెళ్లు అంటూ ఏదో ఒక శక్తి ముందుకు నెట్టింది. వెళ్లిన వెంటనే 'నన్ను మర్చిపోకుండా వచ్చారు చూశారా..' అని ప్రభు అన్నాడు. ఇది మన కుటుంబ కార్యక్రమమని ప్రభుకుసమాధానమిచ్చాను.

  శంకర్‌ ఆశ్చర్యకరమైన దర్శకుడు. అలాంటివారు చాలా అరుదుగానే తమిళ పరిశ్రమకు దక్కుతారు. ఆయనతో రెండు సినిమాలు చేశాను. ఒక సన్నివేశం ఇలానే ఉంటుందని మనం భావిస్తే ఆయన మరోలా తెరకెక్కిస్తారు. ఇలా కూడా రూపొందించొచ్చా అని ఆశ్చర్యపోవటం మన వంతవుతుంది. నిత్యం సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తారు. అందుకే దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరిగా ఉన్నారు.

  ఎదుగుతున్న నటుల్లో బాగా గమనించాల్సిన కథానాయకుడు విజయ్‌. అప్పుడప్పుడు నాతో మాట్లాడుతారు. నేనూ కూడా తరచూ పలకరిస్తుంటా. రాబోయే చిత్రంలో ఎలాంటి పాత్రలో నటిస్తారని తెలుసుకుంటాను. 'తుప్పాక్కి' చూశాను. బాగా నచ్చటంతో మళ్లీ చూశాను. ఇటీవల కాలంలో నేను రెండుమార్లు చూసిన చిత్రం ఇదే. ఏఆర్‌ మురుగదాస్‌, విజయ్‌లను పిలిచి శుభాకాంక్షలు తెలిపాను. ఇకపై కూడా ఇలాంటి సినిమాలే చేయండని విజయ్‌కు సూచించాను.

  నా దృష్టిలో తమ్ముడు అజిత్‌కు ప్రత్యేక స్థానముంది. తారాస్థాయికి చేరుకున్నా.. నా అభిమానిగానే ఉన్నారు. అజిత్‌ అంటే నిజంగానే నాకిష్టం. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన ఓ కార్యక్రమంలో అజిత్‌ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా పనిచేసే సినిమా సంఘాలపై చర్యలు తీసుకోవాలని, కార్యక్రమాలకు హాజరుకాకపోతే తమిళు వ్యతిరేకులన్న ముద్ర వేస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు నాకు తెలియకుండానే లేచి నిలబడి చప్పట్లు కొట్టాను. నిజమైన వీరుడికి ఇచ్చిన మర్యాద అది. ఇప్పటికీ అలాంటి ముక్కుసూటితనంగానే ఉన్నాడు. దేని గురించైనా ఆయనకు నిర్దిష్ట అభిప్రాయముంది.

  విక్రమ్‌లో చాలా శ్రమించే గుణముంది. 'సేతు' నుంచే ఆయన్ను గమనిస్తున్నాను. ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుని దిల్‌, ధూళ్‌, కాశి, జెమిని తదితర వరుస విజయాలతో ఈ స్థాయికి చేరుకున్నారు. 'సామి' ఆయన్ను పరిపూర్ణ నటుడిగా మార్చేసింది. విక్రమ్‌ ఎదుగదల నిజంగా అందరూ ఆశ్చర్యపడేలా ఉంటుంది.

  English summary
  
 South India Super Star Rajanikanth Says that...Tamil Indunstry is Rich with Many Superb Actors like Vikram, Kamal, Surya, Vijay etc and also like directors K.Balachandar and Shankar.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more