'అది చాలా టఫ్ జాబ్' అని తేల్చిన సూపర్ స్టార్
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా 'కొచడైయాన్'అనే త్రిడి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. అక్కడనుంచే ఆయన తన అబిమానులను ఉద్దేశించి సినిమా గురించి మాట్లాడారు. ఆయన చిత్రం గురించి మాట్లాడుతూ...''ఈ సినిమాకు సంబంధించి చాలా ఊహాశక్తి, మైమింగ్ అవసరముంటుంది. ఇది అనుకున్నంత సులభం కాదు. మోషన్ టెక్నాలజీతో షాట్స్ తీయడం ఒక సవాల్ ... ఇదొక టఫ్ జాబ్ అన్నారు.
అలాగే ఈ చిత్రం రజనీ అభిమానులకు 'కొచడైయాన్' ఒక విందులాంటిదని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ అందరి మన్ననలు పొందుతోంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల 12 సెకెండ్ల నిడివి గల ఒక వీడియోను కూడా ఆవిష్కరించారు. రజనీకాంత్, శరత్‌కుమార్, నాజర్‌లతో కూడిన దృశ్యాలను ఇందులో పొందుపరిచారు. చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, శోభన, రుక్మిణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
'రోబో' తర్వాత రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆయన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్. శరత్‌కుమార్, జాకీష్రాఫ్, శోభన, నాజర్ తదితరులు నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. త్రీడీలో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 'అవతార్' తరహా టెక్నాలజీతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. రజనీకాంత్‌తోపాటు శోభన, నాజర్‌లు 'యానిమేషన్ కాస్ట్యూమ్స్'లో నటిస్తున్న ఫొటోలు చిత్రవర్గాలు ఇటీవల విడుదల చేశాయి.
సినిమా గురించి దర్శకురాలు మీడియాతో మాట్లాడుతూ.. ''కోచ్చడయాన్' సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి వాటిలో నటించడం అంత సులభం కాదు. సవాల్‌తో కూడుకున్న విషయం. ఊహకే అంతుచిక్కని లొకేషన్లు ఇందులో కనిపించడం విశేషం. ఇదో ఫాంటసీ సినిమా. కేవలం పిల్లల్నే గాక అందర్నీ ఈ సినిమా ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 13న విడుదలవుతుంది''అని తెలిపారు. 'కోచ్చడయాన్' తెలుగు హక్కుల్ని లక్ష్మీగణపతి ఫిలిమ్స్ దక్కించుకొంది.


Click it and Unblock the Notifications











