ఆ ఇద్దరు హీరోయిన్లతో అంటూ.. సూర్య తండ్రిని ఆటపట్టించిన రజనీకాంత్

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో ఈ సినిమా 'బందోబస్త్'గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. సూర్యతోపాటు ప్రముఖ నటుడు మోహన్ లాల్, తమిళ హీరో ఆర్య, హీరోయిన్ సాయేషా సైగల్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర పాట‌ల‌ను ఆదివారం చెన్నైలో విడుద‌ల చేశారు. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. సూర్య తండ్రి శివకుమార్‌పై సెటైర్లు వదిలారు.

 సూర్య తండ్రితో కలిసి

సూర్య తండ్రితో కలిసి

సూర్య తండ్రి శివకుమార్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో కలిసి రెండు సినిమాల్లో నటించాను. ఆ సందర్బంగా ఓ గమ్మత్తైన అంశం చోటు చేసుకొన్నది. నేను సెట్లో శ్రీదేవి, ఫటాఫట్ జయలక్ష్మీతో కలిసి ముచ్చటిస్తున్నాను. అటువైపు వచ్చిన ఆయన నన్ను చూసి పక్కకు పిలిచాడు. వారితో ఎందుకు మాట్లాడుతున్నావు. హీరోయిన్లతో కలిసి మాట్లాడటమేనా? అని ప్రశ్నించారు. అప్పుడు నేను మాట్లాడటం లేదు. వాళ్లే మాట్లాడుతున్నారని చెప్పాను. అయితే అందుకు జవాబుగా నాతో ఎందుకు మాట్లాడటం లేదని శివకుమార్ అన్నారు.

 శివకుమార్ గురించి రజనీకాంత్

శివకుమార్ గురించి రజనీకాంత్

ఆ తర్వాత అవుట్‌డోర్‌లో షూట్ చేస్తున్నాం. ఆ సమయంలో మళ్లీ హీరోయిన్లతో కలిసి మాట్లాడుతుండటం చూసి ఒక పేజ్ డైలాగ్ ఉన్న స్క్రిప్టును సూర్య తండ్రి శివకుమార్ పంపించారు. అది సింగిల్ టేక్‌లో ఫినిష్ చేయాలి. సాయంత్రం వెలుతురు పోతున్నది. ఆరు గంటల తర్వాత షూట్ చేయడానికి వీలు కాదు. అందుకు కాబట్టి ఒకే షాట్‌లో పూర్తి చేయాలని అసిస్టెంట్ చెప్పారు. దాంతో నేను డైలాగ్స్‌తో కుస్తీ పట్టడం మొదలుపెట్టాను. తీరా చూస్తే ఆరు గంటల తర్వాత ప్యాకప్ చెప్పిన విషయాన్ని రజనీకాంత్ వెల్లడించారు.

 చెప్పాపెట్టకుండా షూటింగ్ క్యాన్సిల్

చెప్పాపెట్టకుండా షూటింగ్ క్యాన్సిల్

షూటింగ్‌కు ప్యాకప్ చెప్పిన విషయం గురించి శివకుమార్‌తో అడిగాను. ఒక పేజ్ డైలాగ్స్‌ నేను కంఠస్థం చేశాను. షూట్ చేయకుండా ఎలా ప్యాకప్ చెబుతారని అడిగాను. వెంటనే శివకుమార్ స్పందిస్తూ.. హీరోయిన్లతో మాట్లాడుతుండటం చూసి నేను సరదా కోసం ఓ పేజ్‌లో డైలాగ్ రాసి పంపిచాను. హీరోయిన్లకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ పనిచేశానని శివకుమార్ చెప్పారు. అంటే తనపైనే కాదు.. తన సహచర నటుడికి కూడా చెడ్డ పేరు రాకుండా చూసుకోవడం శివకుమార్ ప్రత్యేకత. అలాంటిది సూర్య, కార్తీని ఎలా పెంచి ఉంటారో మీరే అర్థం చేసుకొండి అని రజనీకాంత్ చెప్పారు.

 శివకుమార్ గురించి హీరోయిన్లు ఏం చెప్పారంటే

శివకుమార్ గురించి హీరోయిన్లు ఏం చెప్పారంటే

అయితే శివకుమార్ గురించి మరో విషయం కూడా మీకు చెప్పాలి. మీరు శివకుమార్‌తో ఎందుకు మాట్లాడరు అని నేను హీరోయిన్లతో అడిగాను. అందుకు సమాధానంగా.. శివకుమార్ అంతా సుత్తి మాట్లాడుతారు. పాత కాలం ముచ్చట్టు చెబుతాడు. మాకు వినాలంటనే చాలా విసుగ్గా ఉంటుంది. అందుకే మేము ఆయనతో మాట్లాడం. ఆయనకు అందుకే దూరంగా ఉంటాం అని ఆ హీరోయిన్లూ ఇద్దరూ శివకుమార్ గురించి తెలిపారని రజనీకాంత్ చెప్పారు.

రజనీకాంత్‌కు శివకుమార్ థ్యాంక్స్

రజనీకాంత్‌కు శివకుమార్ థ్యాంక్స్

సీనియ‌ర్ న‌టుడు శివ‌కుమార్ మాట్లాడుతూ -కె.వి.ఆనంద్‌గారి గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న కెరీర్ ఓ పెయింట‌ర్‌గా స్టార్ట్ అయ్యింది. కెమెరామెన్‌గా ఎదిగారు. నేష‌న‌ల్ అవార్డ్ అందుకున్నారు. ఈరోజు ద‌ర్శ‌కుడిగా ఇక్క‌డ ఉన్నారు. అయితే ఈయ‌న‌తో నా ప‌రిచ‌యం ఆయ‌న చిన్న‌తనంలోనే జ‌రిగింది. ఆయ‌న 6వ త‌ర‌గ‌తిలో వేసిన ఓ పెయింటింగ్‌కు నా చేత అవార్డు తీసుకోవ‌డం యాదృచ్చికంగా జ‌రిగింది. ఇక ఆనంద్‌గారు డైరెక్ట‌ర్‌గా ఎలాంటి సినిమాలు చేశార‌నే విష‌యాన్ని నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సూర్య‌తో ఆయ‌న 'అయాన్'(వీడొక్క‌డే), 'మాట్రాన్‌'(బ్ర‌ద‌ర్స్‌) సినిమాల‌ను తెర‌కెక్కించారు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. అలాగే మా ఫంక్ష‌న్‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి వ‌చ్చిన ర‌జ‌నీకాంత్‌గారికి, డైరెక్ట‌ర్ శంక‌ర్‌గారికి, ఈ సినిమాలో సూర్య‌తో కీల‌క పాత్ర‌లో న‌టించిన మోహ‌న్‌లాల్‌గారికి థాంక్స్‌. అలాగే ఈ సినిమాలో న‌టించిన న‌టీనటులు, ద‌ర్శ‌కుల‌కు అభినంద‌న‌లు`` అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X