రజనీకాంత్ అనూహ్య నిర్ణయం : అతన్ని తండ్రిగా దత్తత!
ఎవరీ కళ్యాణ సుందరం?
కళ్యాణ సుందరం రిటైర్డ్ లైబ్రేరియన్. తన జీవితం మొత్తాన్ని సామాజిక సేవకే అంకితం చేసిన వ్యక్తి. తను సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా ఆయన సామాజిక సేవకే ఉపయోగించే వాడు. చివరకు తన పదవీ విరమణ సందర్భంగా వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ రూ.10 లక్షలను కూడా ఆయన సమాజం కోసమే ఖర్చు పెట్టారు.
కళ్యాణసుందరం సేవలకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. ఐక్యరాజ్యసమితి ఆయన్ను 20న శతాబ్దపు అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించింది. అయితే మనదేశ ప్రభుత్వాలు మాత్రం ఆయన్ను గుర్తించలేదు. ప్రస్తుతం కళ్యాణ సుందరం బ్రతుకుదెరువుకోసం ఓ హోటల్ లో సర్వర్ గా పని చేస్తున్నారు.
కళ్యాణసుందరం మంచితనం గురించి విని రజనీకాంత్ మనసు కరిగి పోయింది. మన దేశ ప్రభుత్వం అతన్ని కనీసం గుర్తించక పోవడంపై అసంతృప్తిగా ఉన్న రజనీ....అతన్ని తన తండ్రిగా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇలా చేయడం ద్వారా సమాజంలో మార్పు వస్తుందని, మంచి పనులు చేసే వారిని గుర్తించేలా, మరింత మంది మంచి పనులు చేసేలా తన నిర్ణయం ఉపకరిస్తుందని రజనీకాంత్ భావిస్తున్నారట.


Click it and Unblock the Notifications












