Kollywood స్టార్స్ భారీ విరాళాలు.. జనం కోసం కదిలివచ్చిన రజనీకాంత్, సూర్య, అజిత్..
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. గతంలో ఎప్పుడు లేని విదంగా సెకండ్ వేవ్ లో మరణాల సంఖ్య కూడా అధికం అవుతోంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సినీ తారలు వారి స్థానిక ప్రజలు బాగుకోసం భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇక అందరికంటే ఎక్కువగా కోలీవుడ్ సినీ తారలు కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం కొత్త ప్రభుత్వానికి చేయుతను అందిస్తున్నారు.

కోవిడ్ బాధితుల కోసం సినీ తారలు
కరోనా వైరస్ ధాటికి ఎన్నో పరిశ్రమలు మూత పడ్డాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలకు ఈ మహమ్మారి కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఎక్కడికక్కడ షూటింగ్స్ ఆగిపోయాయి. షూటింగ్ పూర్తయిన సినిమాలు ఎప్పుడు మోదలవుతాయో తెలియదు. ఇక కోవిడ్ బాధితుల కోసం సినీ తారలు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు.

కొత్త ప్రభుత్వానికి అండగా..
ఇటీవల తమిళనాడులో కొత్తగా DMK ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ నూతన బాధ్యతలు తీసుకొని తమిళనాడును అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక స్టాలిన్ చేస్తున్న పని తీరుపై సినీ తారలు వారి మద్దతును అందిస్తూ కోవిడ్ బాధితుల కోసం విరాళాలు అందిస్తున్నారు.

సూర్య ఫ్యామిలీతో కలిసి..
ఇక ఇప్పటివరకు ఎవరెవరు ఎంత సహాయం చేశారు అనే లిస్టులోకి వెళితే...ముందుగా హీరో సూర్య, కార్తీ కుటుంబం తరపున కోటి రూపాయల విరాళాన్ని అందించారు. ఇదివరకే వారు కొంతమంది కోవిడ్ బాధితుల కోసం సహాయం చేశారు. ఇక కుటుంబ సమేతంగా సూర్య స్టాలిన్ కు కోటి రూపాయల చెక్ ను అందించారు.

ముఖ్యమంత్రిని కలిసిన రజనీకాంత్
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తనవంతు సహాయంగా ఒక కోటి రూపాయలను కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం అందజేశారు. స్టాలిన్ తో ఆయన రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సౌందర్య రజనీకాంత్ ఫ్యామిలీ కూడా 1కోటి రూపాయలను విరాళంగా ముఖ్యమంత్రికి అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video

అజిత్, ఏఆర్.మురగదాస్ కూడా..
ఇక మరొక స్టార్ హీరో అజిత్ కూడా తనవంతు సహాయంగా కోవిడ్ బాధితుల కోసం 25లక్షల రూపాయల చెక్ ను అందించారు. ఇక మరో దర్శకుడు AR మురగదాస్ కూడా 25లక్షల చెక్కును స్టాలిన్ కు అందజేశారు. ఉదయనిధి స్టాలిన్ సైతం 25లక్షల రూపాయల అందిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications











